ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ..
1 min read– ప్రశాంతంగా ఓటు వేసిన పట్టభద్రులు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల.. ఓర్వకల్ పాణ్యం: సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి జరిగిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నియోజకవర్గ పరిధిలోని గడివేముల ఓర్వకల్ పాణ్యం మండలాల్లో పోలింగ్ ప్రక్రియను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి .. పాణ్యం టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పరిశీలించారు.పాణ్యం నియోజిక వర్గ పరిధిలోని ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల్లో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓటింగ్ శాతం వివరాలు.ఓర్వకల్లు:పట్టభద్రుల ఎమ్మెల్సీమొత్తం ఓట్లు 1213 గాను 970 నమోదు కాగా79.96% శాతం.ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 70 గాను 65 నమోదు కాగా 92.8 శాతంగా నమోదయ్యాయి.పాణ్యంపట్టభద్రులఎమ్మెల్సీ , మొత్తం ఓట్లు 1066 గాను 824నమోదు కాగా 76.7% శాతం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ,మొత్తం ఓట్లు 75 గాను 71 నమోదు కాగా94.6% శాతం. గా నమోదయింది.గడివేముల పట్టభద్రుల ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 962 గాను759నమోదు కాగా, 78.8% శాతం.ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు 43 గాను 43 నమోదు కాగా100% శాతం. గా నమోదైంది ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల సరాసరి ఓటింగ్ శాతం
పట్టభద్రుల ఎమ్మెల్సీ 78.4 % శాతం.
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ 95.8% శాతం. గా నమోదయింది. గడివేములలో ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓర్వకల్లులో సీఐ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై మల్లికార్జున బందోబస్తు ఏర్పాటు చేశారు . పాణ్యం లో సీఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.