నందికొట్కూరు లో 79.42శాతం పోలింగ్
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టబద్రులు, ఉపాధ్యాయ శాసన మండలికి సోమవారం జరిగిన ఎన్నికలలో 79.42 శాతం పోలింగ్ నమోదైంది. 307 పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓట్లు 1028 ఉండగా 823 మంది పట్టబద్రులు , 308 పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓట్లు-1056 ఉండగా 793 మంది పట్టబద్రులు , 314 పొలింగ్ కేంద్రంలో మొత్తం ఓట్లు 705 ఉండగా 586 మంది పట్టబద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.పట్టబద్రులు 79.42 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులు 164 పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓట్లు227 ఉండగా 265 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాద్యాయులు 95.32 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.సోమవారం నందికొట్కూరు పట్టణంలోని బాలికల జడ్పీ పాఠశాలలో జరుగుతున్న శాసన మండలి ఎన్నికలను నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పరిశీలించారు.ఎన్నికలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఇంచార్జి డిఎస్పీ రామాంజనేయ నాయక్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపు గుంపులుగా ఎవరు ఉండరాదని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా అసాంఘిక సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అర్బన్ సీఐ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై ఎన్వీ రమణ ,పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.