హిజ్రాలకు ఓటు హక్కు కల్పించిన ఘనత సీఎం జగన్ దే
1 min read– ఒకే ఒక్క హిజ్రా పట్టభద్రురాలు మాధురి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో ఒకే ఒక్క హిజ్రా ఓటు హక్కును వినియగించుకున్నారు. మాధురి గౌడ్ అనే హిజ్రా పట్టభద్రురాలు 2015 లో పట్టభద్రురాలు. సోమవారం జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో మాధురీ గౌడ్ అనే హిజ్రా మొట్టమొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా హిజ్రా మాధురి గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు మాకు కల్పించలేదని, మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హిజ్రాలకు మొట్టమొదటి సారి అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా హిజ్రాలకు ముఖ్యమంత్రి వై ఎస్ జగనన్న హిజ్రాలను గుర్తించి ఓటు హక్కు కల్పించారని ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు.