49 బన్నూరులో ఏకదిన స్వస్థత కూటమి -ప్రత్యేకంగా స్వస్థత ప్రార్థనలు
1 min read– అత్యద్భుతంగా వాక్య పరిచర్య చేసిన ఉప్పు మాగలూరు విచారణ గురువు ఫాదర్ మధుబాబు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో జరిగిన ఏకదిన స్వస్థత కూటమి జరిగింది.మంగళవారం రాత్రి 49 బన్నూరు ఆర్సీఎం చర్చిలో ఏక దిన స్వస్థత కూటమి కార్యక్రమానికి వాక్య పరిచర్య చేయుటకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా ఉప్పుమాగులూరు విచారణ గురువులు ఫాదర్ డి.మధుబాబు గారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి,సమస్యలతో బాధపడుతున్న వారికి మరియు విద్యార్థుల మంచి ఉత్తీర్ణత కొరకు ఆయన ప్రత్యేకంగా వాక్య పరిచర్య చేశారు.ఈ 40 రోజుల ఉపవాస దినాలలో పాటించవలసిన విషయాలు మరియు మానవుడు దేవునికి వ్యతిరేకంగా కార్యములు చేసినందుకు గాను లోకరక్షకుడైన ఏసుక్రీస్తు మానవులను రక్షించుట కొరకు ఆయన సిలువ మ్రాను పైన మరణించారని అన్నారు. మానవులకు పంతాలు,ద్వేషాలు,కుళ్ళు,కుతంత్రాలు,ఇతరుల వినాశనాన్ని కోరుకొనుట తదితర వాటి గురించి ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమని వీటికి మానవుడు దూరంగా ఉండాలని అప్పుడే మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉంటాయన్నారు.క్రొవ్వొత్తి ఏవిధంగా కుటుంబాల్లో వెలుగునిస్తుందో ఆ విధంగానే మన కుటుంబాల్లో వెలుగు ఉండాలంటే దేవుడు చెప్పిన విధంగా పాటించాలని అన్నారు.అనంతరం ఫాదర్ మధుబాబు మరియు ఉప్పలదడియ విచారణ గురువులు ఫాదర్ శ్యామ్ కుమార్ దివ్య బలిపూజను సమర్పించి అందరికీ దివ్య సత్ప్రసాదాన్ని అందించారు. అనంతరం వచ్చిన వారందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో సంగీత వాయిద్య కారుడు రమేష్,డేవిడ్ మరియు సంఘస్తులు పాల్గొన్నారు.