PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం

1 min read

– 2025 నాటికి రక్తహీనత (ఎనిమియా) నివారణ దిశ జిల్లాగా చర్యలు చేపట్టాలి..
– ఆర్ బిఎస్ కె జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ మానస
– ఏలూరు జిల్లాలో 4.06 లక్షల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్ధ కార్యక్రమం కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు రూరల్ శనివారపుపేట జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో విద్యార్ధినీ విద్యార్ధులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. డి. ఆశ, డిఇఓ ఎన్.వి. రవిసాగర్, ఆర్ బిఎస్ కె జిల్లా కో-ఆర్డినేటర్ డా. సిహెచ్ మానస తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ మానస , వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు అందరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకున్న తర్వాత, విద్యార్థిని విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ బిఎస్ కె జిల్లా కో-ఆర్డినేటర్ డా. సిహెచ్ మానస మాట్లాడుతూ జిల్లాను 2025 నాటికి రక్తహీనత(ఎనీమియా) రహిత జిల్లాగా. ఉంచేదిశగా నివారణచర్యలు చేపట్టాలన్నారు. ఎనీమియాను నివారించేందుకు నులిపురుగుల నివారణ ఎంతో ముఖ్యమని అందుకు ఆల్బెండజోల్ మాత్రలను విద్యార్థినీ విద్యార్థులు, అందరు వేసుకోవాలన్నారు. అందువల్ల కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు అన్నీ కూడా నిర్మూలించబడతాయని తద్వారా రక్తహీనత, శారీరక అలసట తగ్గుతాయని మంచి ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు , ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ఈ విడత వైద్య ఆరోగ్య సిబ్బందితోపాటు ఎంపిడిఓ తదితర అధికారులను కూడా భాగస్వాములను చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4.06 లక్షల మంది బాల బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి విద్యాసంస్ధకు నోడల్ అధికారులను పర్యవేక్షకులగా నియమించడం జరిగిందన్నారు. చేతులను భోజనానికి ముందు తరువాత , ఆడుకున్న తరువాత, కనీసం 20 సెకన్లు చొప్పున చేతులను సబ్బుతో శుభ్రం కడుక్కొని ఆహార పదార్ధాలు తీసుకోవాలని నులిపురుగుల నివారణతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఆమె పేర్కొన్నారు. అల్బండజోల్ మాత్రలు వేసుకున్న సమయంలో ఎటువంటి అనర్ధాలు జరుగవని ఏమైనా ఉన్నాగానీ స్వల్పంగానే ఉంటాయన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యాధికారులను కూడా అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. డి. ఆశ మాట్లాడుతూ విద్యార్ధి దశనుంచి పిల్లలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన పెంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పాలన్నారు. ప్రభుత్వం తరపున ప్రతి ఆరునెలలకోకసారి 1-19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరికి అల్బండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మంగళవారం ఎవరైనా పిల్లలు మాత్ర వేసుకోనీ పక్షంలో వారికి మళ్లీ ఈ నెల 18వ తేదీన అల్బండజోల్ మాత్ర వేయడం జరుగుతుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.వి. రవి సాగర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్నిపాఠశాలలో చదువుతున్నటువంటి ,విద్యార్థిని విద్యార్థులందరికీ అల్బండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు, ఏలూరు రూరల్ ఎంఈఓ సబ్బిథి నరసింహమూర్తి, ఏలూరు ఎంపీడీవో డాక్టర్ బి ప్రణవి వైద్యశాఖా అధికారిని డాక్టర్ మంజూష, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ,ఏ సర్వేశ్వరరావు పలువురు ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

About Author