PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీఆర్ డీఓ లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: హైద‌రాబాద్ లోని డిఫెన్స్ రీస‌ర్చ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆర్గనైజేష‌న్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీస‌ర్చ్ డెవ‌ల‌ప్ మెంట్ లేబొరేట‌రీ వివిధ పోస్ట‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. డీఆర్ డీవో భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప‌ని చేస్తుంది.
సంస్థ: డీఆర్ డీవో
ఉద్యోగం: జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో
మొత్తం ఖాళీలు- 10
విభాగాలు : మెకానిక‌ల్ ఇంజినీరింగ్, ఏరోనాటిక్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.

అర్హత‌: జేఆర్ఎఫ్ ఉత్తీర్ణత‌. సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ పాస్ అయి ఉండాలి.
వ‌య‌సు : 28 ఏళ్లు మించ‌కూడ‌దు.
స్టైఫండ్ : నెల‌కు 31000 చెల్లిస్తారు.

రిస‌ర్చ్ కాల వ్యవ‌ధి: 2 సంవ‌త్సరాలు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌ లైన్
ఎంపిక విధానం:గ్రాడ్యుయేష‌న్ మార్కులు, గేట్ మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ద్వార తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 14-6-2021
ఇంట‌ర్వ్యూ వేదిక‌: డిఫెన్స్ రీస‌ర్చ్ డెవ‌ల‌ప్ మెంట్ లేబొరేట‌రీ, ఏపీజే. అబ్దుల్ క‌లాం మిసైల్ కాంప్లెక్స్, కంచ‌న్ బాగ్ పీవో, హైద‌రాబాద్-500058

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన అడ్రస్: డిఫెన్స్ రీస‌ర్చ్ డెవ‌ల‌ప్ మెంట్ లేబొరేట‌రీ, ఏపీజే. అబ్దుల్ క‌లాం మిసైల్ కాంప్లెక్స్, కంచ‌న్ బాగ్ పీవో, హైద‌రాబాద్-500058

About Author