మేక మాంసo వర్తక సంఘం నూతన కార్యవర్గం
1 min read– ఆళ్ల నాని ఆదేశాలతో కోటి రూపాయల నిధులతో కబేళాలో పలు అభివృద్ధి పనులు
– మేయర్ నూర్జహాన్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: జిల్లా మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశాలతో సుమారు కోటి రూపాయల నిధులతో కబేలలో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందనీ నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. స్థానిక మాదేపల్లి రోడ్ లోని మేకల కబేలాలో జమాతుల్ ఖురేషి (మేక మాంసం వర్తక సంఘం) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేకల కబేలా వద్దకు చేరుకున్న మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు నూతన కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కబేలాలోని రక్తపు నీరు కాలువల ద్వారా బయటకు వెళ్లడం ద్వారా దుర్వాసన రావడం కారణంగా స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకొని రూ.25 లక్షల రూపాయలతో అధునాతన టెక్నాలజీతో ట్రీట్మెంట్ ప్లాంట్ ను నిర్మించి బయటకు వచ్చిన రక్తపు నీటిని శుద్ధిచేసి అనంతరం బయో కెమికల్ ప్రాసెస్ చేసి ఆ నీటిని మొక్కలు పెంపకానికి ఉపయోగించడం జరుగుతుందని, దీని కారణంగా స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయగలిగామన్నారు. అదే విధంగా కబేలాలో నేల పైన పడిన మలినాలు నీరు భూమిలోకి పీల్చుకోకుండా ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఉపయోగించే పి.యు ఫ్లోరింగ్ ను చేయడం జరిగిందనీ, అవసరమైనన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అమర్చడం జరిగిందన్నారు. కబేలాలో ఉన్న కమ్యూనిటీ హాల్ నందు జమాతుల్ ఖురేషి ముస్లింలు నమాజులు, ప్రార్థనలు, కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకొనుటకు శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశాలతో కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందనీ, ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు ఐక్యతతో కబేలాను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఈ సందర్భంగా మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, శ్రీనివాస్, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాస్, మహమ్మద్ ఇలియాస్ పాషా, దారపు తేజ అనూష , మాజీ కార్పొరేటర్ లంకలపల్లి వెంకట గణేష్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.