మండలంలో 850 క్వింటాళ్ల మద్దతుధరపై జొన్నల కొనుగోలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: నంద్యాల జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గడివేముల మండలంలోని జొన్నలు కొనుగోలు చేసే ఆరు కేంద్రాలు అయినటువంటి పెసరవాయి , బిలకల గూడూరు, చిందుకూరు, గడిగరేవుల , కరిమద్దెల మరియు కోరట్మద్ది ఆర్ బి కే కొనుగోలు కేంద్రాలు మంజూరు చేసినట్టు వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు . మంగళవారం నాడు జిల్లా వ్యవసాయ అధికారి (నంద్యాల ) పెసరాయి గ్రామంలోని పరమేశ్వర్ రెడ్డి ,రాజేశ్వర్ రెడ్డి అనే రైతులకు దాదాపు 300 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి 600 గోనె సంచులు పంపిణీ చేశారు. మార్క్ఫెడ్ నుంచి విష్ణువర్ధన్ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.ఇప్పటివరకు గడివేముల మండలానికి 1000 మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇవ్వగా ఇప్పటికీ దాదాపు 85 మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోలును చేశామన్నారు .జొన్న కొనుగోలు మద్దతు ధర 2970 ఒక క్వింటాకు. లోడింగ్ అన్లోడింగ్ హమాలీ ప్రాసెసింగ్ చార్జీలకు 22 రూపాయలు క్వింటాలుకి ఇవ్వడం జరుగుతుందన్నారు అయితే రవాణా మరియు గోనె సంచుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదేవిధంగా పప్పు శనగకు సంబంధించి ఇప్పటివరకు మండలంలో 47 మంది రైతుల నుంచి దాదాపు 89 మెట్రిక్ టన్నుల పప్పు శనగను గోడౌన్ కి రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.