లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయం
1 min read– ప్రముఖ వైద్యులు డా.లయన్ మహేశ్వర్ రాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలో ఉండే కృష్ణ హాస్పిటల్ లో చిన్న పిల్లల వైద్యులు డా.ఉషారాణి,ప్రముఖ వైద్యులు డా.లయన్ మహేశ్వర్ రాజు దంపతుల ఆర్థిక సౌజన్యంతో రాయచోటి టిబి యూనిట్ రోగులకు పౌష్టిక ఆహారాన్ని అందజేసినట్లు అద్యక్షులు లయన్ షేక్ మహమ్మద్ గారు తెలిపారు, అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ఆహారం అయితే మనము తీసుకుంటే మనం అనారోగ్య పాలు కాకుండా శక్తివంతంగా ఉంచి జీవన పరిమాణము మెరుగవుతుందో అదే పౌష్టిక ఆహారము అన్నారు. పౌష్టిక ఆహారం తీసుకోవడంలో సమతుల్యత వైవిధ్యం పరిమితింగా ఉండగలగడం అనేది ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులు అని వైద్యులు చెబుతున్నారు అంటే సుతిమించిన స్థాయిలో క్యాలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిద్య భరితమైన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా కావున మనమందరము విలైనంతగా ఫ్రిజ్జులో పెట్టిన ఆహారాన్ని ,బయటి ఫుడ్ లకు దూరంగా ఉండి పౌష్టిక ఆహారం తీసుకోవాలని,అలాగే టిబి రోగులకు నెలకు ఒకసారి చొప్పున 6 నెలల వరకు న్యూట్రిషన్ ఫుడ్ అంధజేస్తామని , వీళ్లకే కాకుండా రాయచోటి నియోజకవర్గం లో ఉండే టిబి రోగులకు దాతల సహారంతో వాళ్ళందరికీ పౌష్టిక ఆహారాన్ని అంజేస్తామని తెలిపారు . అనంతరం దాత చిన్నపిల్లల వైద్యులు డా.ఉషారాణి గారు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రాయచోటి లో ఉండే టిబి రోగులకు నా వంతుగా న్యూట్రిషన్ ఫుడ్ ను ఇప్పటివరకు 2 నెలలు ఇచ్చినాము అని ఇది 3 వ నెల ఇవ్వడం జరిగందని, ఇంకా 3 నేనలు ఇస్తామని తెలిపారు.అనంతరం ప్రముఖ వైద్యులు డా.లయన్ మహేశ్వర్ రాజు మాట్లాడుతు ఈ రోజు డా.హెచ్ ఉషారాణి తన వంతుగా టీబి రోగులకోసం న్యూట్రిషన్ ఫుడ్ అందజేసీనందుకు చాలా సంతోషంగా ఉందని,అలాగే ప్రతి ఒక్కరు సరైన టైంలో తినడంతో పాటు సరైన ఫుడ్ తీసుకోవడం , దీనితోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా ఉంటే మనమందరము ఆరోగ్యంగా ఉంటాము మరి ముఖ్యంగా టిబి ఉన్నవాళ్లకు న్యూట్రిషన్ ఫుడ్ ఎంతో మేలు కలిగిస్తుందనితెలిపారు. అలాగే రాబోయే రోజులలో దాతల సహకారంతో రాయచోటి నియోజకవర్గంలో ఉండే టిబి రోగులకు పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని అధ్యక్షులు లయన్ షేక్ మహమ్మద్ గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ,నందిని ట్రావెల్స్ వినోద్ కుమార్ నాయక్, ఫకృద్దిన్, టిబి యూనిట్ సూపర్వైజర్ గంగయ్య, కృష్ణ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.