PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసిపి ప్రభుత్వం

1 min read

– దొంగ ఓట్లకు అడ్డు అదుపు లేదు :కొట్టె మల్లికార్జున బిజెపి యువ నాయకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు మూడు ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దొరికిన చోట దొరికినట్లుగా బోగస్ ఓట్లకు, దొంగ ఓట్లకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. సాక్షాత్తు ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా చిత్తూరు, తిరుపతి మరియు మరికొన్ని చోట్ల 6th,7th,10th మరియు ఇంటర్ చదివిన మహిళలు, పురుషులు కూడా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళు దొంగ ఓట్లు వేయడానికి వచ్చాము అనే పశ్చాత్తాపంను ఎక్కడ కనబడనివ్వలేదు.పైగా తాము ఓటర్లు కాకపోయినప్పటికీ, తాము చేస్తున్న తప్పుని సమర్ధించుకోవడాన్ని చూస్తే, అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు మరియు మరికొంతమంది అధికారుల కనుసనల్లోనే ఇదంతా జరిగిందని భావించొచ్చు. మరికొన్నిచోట్ల హింసాత్మక దాడులు జరగడమే కాదు, వ్యక్తిగత దూషణలు కూడా తారస్థాయికి చేరడాన్ని మీడియాలో ప్రతి ఒక్కరు ఇతర పార్టీ నాయకులు, ప్రజలు అందరూ చూశారు.అధికార ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని , అత్యధిక మెజారిటీని బూచిగా చూపిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా, ఇతర పార్టీల నాయకులను, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికల్లో కూడా అవకతవకలకు పాల్పడుతూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారము హక్కులను పౌరులు, యువతీ యువకులు కోల్పోవడమే కాదు, ఓటు హక్కును కూడా కోల్పోయే అవకాశమున్న రాష్ట్రం, దౌర్భాగ్య పరిస్థితులు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే ఉంటాయేమో బహుశా అని మీడియా ముఖంగా ప్రజలకు, మేధావులకు తెలియజేస్తున్నాను అని కొట్టె మల్లికార్జున పేర్కొన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ, ఇంకా కొన్ని కొన్నిచోట్ల యువతీ, యువకులు, కొంతమంది పట్టభద్రులు అధికార పార్టీ ,ఇతర పార్టీ నాయకుల డబ్బులకు అమ్ముడుపోతున్నారంటే స్వాతంత్రం వచ్చిందని గర్వపడాలో, లేకపోతే నీతి, నిజాయితీ, విలువలతో ఓటు వేయాల్సిన చదువుకున్న విద్యార్థుల చేతుల్లో కూడా ప్రజాస్వామ్యం ఓడిపోయిందని పేర్కొనాలో అర్థం కావట్లేదు అన్నారు. యువతీ, యువకులు మరొక్కసారి ఆలోచించే సమయం దగ్గర పడింది.కనీసం రాబోయే 2024 ఎన్నికల్లోనైనా ప్రజలు, చదువుకున్న యువతీ, యువకులందరూ సంక్షేమం ముసుగులో ప్రజలను సోమరిపోతులుగా మారుస్తూ, రాష్ట్రంలో అధిక ద్రవ్యోల్బణం రేట్లు పెరిగేలా చేస్తున్న ప్రస్తుత అధికార ప్రభుత్వానికి బుద్ధి చెబుతూ, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మొత్తం మీదుగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన పశ్చిమ రాయలసీమ,తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి గెలుపుకు ప్రచార కార్యక్రమాలతో కృషిచేసిన బిజెపి పార్టీ నాయకులు అందరికీ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఉపాధ్యాయ, పట్టభద్రులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

About Author