ఆశా వర్కర్ల ధర్నా విజయవంతం చేయండి : కళ్లేపల్లి శైలజ
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆశ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 21000 లుగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం (17వ తేదీ)గాంధీనగర్ లోని ధర్నా చౌక్ వద్ద జరిగే సామూహిక నిరసన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శి కళ్ళేపల్లి శైలజ పిలుపునిచ్చారు. గొల్లపూడి సెక్టార్ లోని ఆశా వర్కర్లతో జరిగిన సమావేశంలో శైలజ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. దీర్ఘకాలికంగా ఉన్న ఆశా వర్కర్ల సమస్యలపై ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 42,346 మంది ఆశా వర్కర్లు ప్రతినిత్యము ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందిస్తున్నారని గర్భవతుల నమోదు నుండి బిడ్డ ఆరోగ్యంగా నడిచే వరకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. కరోనా వంటి కరోనా వంటి విపత్కరమైన ఆపద సమయాల్లో ముందుండి సమాజంలో ఫ్రంట్ వారియర్స్ గా పనిచేశారన్నారు. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖా ఇచ్చే ప్రతి ప్రోగ్రాం లో వారు తమదైన ముద్ర వేసుకున్నారన్నారు. అయినప్పటికీ సమాజంలో పెరుగుతున్న ధరలు కనుగుణంగా వారి జీతాలు పెరగకపోవడం వారికి ఇచ్చేది ప్రభుత్వం కేవలం 10000 మాత్రమే అందులో కేంద్ర ప్రభుత్వం ఆరున్నర వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర వేలు ఇస్తుందన్నారు. ఆనాడు మన ముఖ్యమంత్రి పాదయాత్రలలో ఆశ వర్కర్లకు మీ కష్టాలు నేను చూశాను నేను విన్నాను మీకు నెలకు రూ. 20000 లు ఇస్తానని హామీ ఇచ్చి ఈనాడు తుంగలో తొక్కారన్నారు. అంతేగాక వారితో వెట్టిచాకి చేయిస్తూ వారి భవిష్యత్తులో పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేకుండా పోయిందన్నారు. సామాజిక భద్రత లేనందువల్ల ఆశ కార్యకర్తలకు కనీస వేతనం 21000 పెంచి జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పించి ఆశ వర్కర్లను మెడికల్ ఉద్యోగస్తులు ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు నుండి 62 సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళా ఫోరం తరుఫున ఆశాలకు రికార్డులను కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఆశ కార్యకర్తల పోషణ వెంటనే భర్తీ చేయాలి ఆశలను ఉద్యోగాలలో వెయిటేజ్ మార్కులు విధిగా ఇవ్వాలని చెప్పినా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆశా వర్కర్లు రాజకీయ వేధింపులు, లైంగిక వేదింపులు అరికట్టాలని కోరుతూ సామూహిక దీక్షకు ఆశా కార్యకర్తలు తరలిరావాలని శైలజ పిలుపునిచ్చారు.