క్షయవ్యాధిరహిత సమాజం అందరి బాధ్యత
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లోపు మండలం రామాపురం గ్రామంలో నిక్షయ్ దివాస్ హెల్త్ మేళా సందర్బంగా, టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది అనే నినాదములో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ హాజీవలి మాట్లాడుతూ క్షయ వ్యాధి బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవుకు మండలం రామాపురం గ్రామములో లో బుధవారం క్షయ వ్యాధి అవగాహన సదస్సు CHO హాజీవలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది,క్షయ వ్యాధి లక్షణాలు (రెండు వారలకి మించిన దగ్గు, జ్వరం, బరువు తగ్గటం మరియు రాత్రి పూట చెమటలు పట్టడము ) ఉంటే తగిన పరీక్షలు చేయింకోవాలి అని,వ్యాధి నిర్ధారణ తో పాటు ప్రభుత్వం మందులు అందజేస్తుందని క్షయ వ్యాధి రహిత సమాజం అందరి బాధ్యత అని తప్పనిసరిగా అందరూ వ్యాధి నిరోధక శిక్షణ ఇచ్చే పౌష్టిక ఆహారము తీసుకోవాలని వారు పేర్కొన్నారు , ఈ కార్యక్రమంలో కే హాజీవలి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఎస్ వెంకటేశ్వరమ్మ ఏ యన్ మ్ ఆశ వర్కర్స్ రాములమ్మ, సుజాత మరియు తదితరులు పాల్గొన్నారు.