బడ్జెట్ సమావేశాల్లో స్కీమ్ వర్కర్లకు బడ్జెట్ కేటాయించాలి
1 min read– ఏఐటీయూసీ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ఈనెల జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో స్కీం వర్కర్లకు సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ,వారి న్యాయమైన కోరికలు తీర్చాలని అందర్నీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని , సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ,కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలనిఈనెల 17న ఏఐటియుసి ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారని ఈ ధర్నాకు స్కీం వర్కర్లైన ఆశ , అంగన్వాడి ,మధ్యాహ్న భోజన పథకం ,స్కూల్ ఆయాలు ధర్నాలో పాల్గొనిధర్నాను విజయవంతం చేయాలని ఏఐటియుసిజిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి .శివ బాలకృష్ణపిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ స్కీం వర్కర్లకుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుచాలా అన్యాయం చేస్తున్నాయని ఆశా వర్కర్లకు కరోనా సమయంలో 6000 రూపాయలు చెల్లిస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం అలాగే కరోనాలో చనిపోయిన ఆశా వర్కర్లకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరియు ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై నోరు మెదపడం లేదని అన్నారు. అలాగే స్వచ్ఛభారత్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్సు మరియుఆయా గా పిలువబడే కార్మికులకు గత పెండింగ్ వేతనాల్లో30 నెలల గాను కేవలం 18 నెలలు మాత్రమే ఇచ్చి12 నెల జీతాలుఅడగకూడదనికేవలంఇప్పుడు పనిచేసే వేతనాలు మాత్రమే అడగాలని అధికారులు బెదిరిస్తున్నారు.దారిద్రరేఖకుదిగువన ఉన్నఈ ఆయాల పోట్టగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇకనైనా జగన్ మోహన్ రెడ్డి గారికి వీరిపైన ఏమైనా దయాదాక్షిణయాలు ఉంటే వారి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించేలా ఏర్పాటు చేయాలని, పిచ్చుకల మీదబ్రహ్మాస్త్రంపనిచేయదని ఈ ఆయాల వేతనాలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తారని డిమాండ్ చేశారు. స్కీం కార్మికులకు గుర్తింపు కార్డులు ఏర్పాటు చేయాలని ,ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని డిమాం చేశారు .అదేవిధంగా ఈ నెల 17న జరగబోయే ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.