కౌంటింగ్ లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
1 min read– ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ రేపు (16 -03-2023)న ఉదయం 8 గంటల నుండి కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంగణంలో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని , స్ట్రాంగ్ రూము మరియు మీడియా కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఓట్ల లెక్కింపును ఏజెంట్లు స్పష్టంగా చూసేందుకు అనుకూలమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కౌంటింగ్ కి సంబంధించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగిన ఏర్పాట్లు మరియు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, కర్నూలు మరియు కల్లూరు తహశీల్దార్ లను మరియు కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.