పల్లెల్లో కుక్కలు హల్ చల్ – బెంబేలెత్తుతున్నన్న పిల్లలు,వృద్ధులు
1 min read-అధికారులు నిద్ర మబ్బు వీడాలంటున్న
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో కుక్కలు హల్ చల్ చేస్తూ ఉండటం వల్ల పిల్లలు వృద్దులు ప్రజలు బెంబేలెత్తుతున్నారు.రాత్రనక పగలు అనకా వీధుల్లో మరియు రహదారుల వెంట కుక్కలు గుంపులు గుంపులుగా వస్తూ ఉండడం అవి విపరీతంగా మొత్తుకోవడం,కుక్కలు కోట్లాడుకోవడం అవి గుంపులుగా వస్తూ గ్రామాల్లో గ్రామాల్లో ఉన్న పిల్లలను వెంబడించడం కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా చిన్నపిల్లలను,పొట్టేళ్లను వెంబడించి కుక్కలు గాయ పరుస్తున్నాయని అంతేకాకుండా రహదారుల వెంట వెళ్లే ద్విచక్ర వాహనదారులపై కుక్కల వెంట పడుతూ ఉండడం వలన వాహనదారులు కింద పడుతూ ఉన్నారని వివిధ గ్రామాల ప్రజలు అంటున్నారు.మండలంలో మొత్తం 19 పంచాయితీలు(మజారా గ్రామాలు కలిపితే 24ఉన్నాయి.పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్తే ఎక్కడ పిల్లల్ని గాయ పరుస్తాయోనని భయాందోళన ఉందని అధికారులు నిద్రమబ్బు వీడాలని తల్లిదండ్రులు అంటూ ఉన్నారు.కుక్కలను పట్టుకోవడంలో తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఇప్పటికైనా అధికారులు పట్టించుకోకపోతే చాలామంది కుక్కల బారిన పడి గాయాలపాలై మృతి చెందే పరిస్థితులు ఏర్పడుతాయని వెంటనే సంబంధిత అధికారులు కుక్కలు నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు అంటూ ఉన్నారు.