ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలి
1 min read– జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల 2023 అన్నమయ్య జిల్లాలోని పరీక్ష కేంద్రాలలో నియమించినటువంటి చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు బాధ్యత గా నిధులు నిర్వహించాలని జిల్లాలో విద్యా శాఖ అధికారిని రాఘవరెడ్డి పేర్కొన్నారు .సమీక్ష మరియు శిక్షణ సమావేశం బుధవారం లయ గార్డెన్స్ రాయచోటి పట్టణం నందు జరిగినది. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపర్డెంట్లు మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు పరీక్షల సమయంలో విధులు ఏ విధంగా నిర్వహించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా రిసోర్స్ పర్సన్ రామకృష్ణ హెడ్మాస్టర్ మరియు నాగమనిరెడ్డి రెడ్డి గారు డిసిబి సెక్రెటరీ వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వై. రాఘవ రెడ్డి గారు ఉప విద్యాశాఖ అధికారులు శ్రీమతి బీ. వరలక్ష్మీ మరియు జి .కృష్ణప్ప గారు, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శ్రీ ఎం .ప్రసాద్ బాబు గారు, సూపర్నెంట్ రవికుమార్ గారు, సెక్షన్ అసిస్టెంట్ రమేష్, మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.