ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ప్రారంభం
1 min readపల్లెవలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ పూర్వ కేంద్రీయ కోషాధికారి కీ.శే.మాన్య శ్రీ జి.పుల్లారెడ్డి గారి తనయుడు ఏకాంబర రెడ్డి గారి దాతృత్వం తో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ రోజు 16/3/23 న ఉ. 11:00 గం.లకు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం,శ్రీ జి.పుల్లారెడ్డి భవన్, భరతమాత మందిర ప్రాంగణం,రెవెన్యూకాలనీ, కర్నూలు లో 4 కంప్యూటర్లతో ” శ్రీమతి జి.నారాయణమ్మ ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ” కర్నూలు జి.పుల్లారెడ్డి నేతిమిఠాయి సంస్థల అధినేత ఏకాంబర రెడ్డి చేతులమీదుగా పూజ చేసి ప్రారంభించారు…అనంతరం జరిగిన సభాకార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ కర్నూలు జిల్లా విశ్వహిందూ పరిషత్ నిర్వహించే ఎన్నో సేవాకార్యక్రమాలలో సింహభాగం జి.పుల్లారెడ్డి కుటుంబం సహకారంతోనే నిర్వహించబడతాయని, తండ్రి బాటలోనే తనయులు కూడా నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్పవిషయమని కొనియాడారు.విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా గోకవరం లో జన్మించిన జి పుల్లారెడ్డి గారు తాను జన్మించిన ఈ జిల్లా విశ్వ హిందూ పరిషత్ కు ఎంతో సేవ చేశారనీ ఇప్పటికి నడుస్తున్న విజ్ఞాన పీఠం (అరక్షిత శిశుమందిరం),జి.నారాయణమ్మ మానసిక వికలాంగుల వసతి గృహము,రాఘవరెడ్డి గారి దాతృత్వం తో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయభవనం పై బజరంగ్ దళ్ కార్యకర్యల కోసం వ్యాయామశాల కట్టించాలని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు..అనంతరం జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ శాలువాతో ఏకాంబర రెడ్డి గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సామాజికసమరసత కన్వీనర్ కృష్టన్న,ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్,కోశాధికారి సందడి మహేశ్వర్,బజరంగ్ దళ్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, జిల్లా కోశాధికారి , సంఘటనా కార్యదర్శి వడ్ల భూపాలాచారి,అయోధ్య శ్రీనివాస రెడ్డి, సహకార్యదర్శి శివప్రసాద్, గోవిందరాజులు,నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి, కార్యదర్శి ఈపూరి నాగరాజు,రఘునాథ్ సింగ్,కార్యాలయ ఆవాసం విద్యార్థులు పాల్గొన్నారు.