PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెల‌కు రూ.1000 తో రూ.2 కోట్లు పొందండి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నెల‌కు రూ.1000 రూపాయ‌లు పెట్టుబ‌డి పెడితే.. 30 సంవ‌త్సరాల‌కు ఆ పెట్టుబ‌డి రూ.2 కోట్లుగా మారుతుంది. మ్యూచువ‌ల్ ఫండ్స్ ద్వార నెల‌నెల పెట్టుబ‌డి పెట్టాలి. ఇది లాంగ్ ట‌ర్మ్ లోనే మంచి లాభాల్ని ఇస్తుంది. మోతిలాల్ ఓస్వాల్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ను ప్రారంభించింది. ఆగ‌స్టు 19 , 2019లో మోతిలాల్ ఓస్వాల్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ను మొద‌లుపెట్టింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది స్టాక్ మార్కెట్ లో వివిధ బ్యాంక్ స్టాక్ ల స‌మాహారం. వివిధ ప్రైవేట్, ప‌బ్లిక్ బ్యాంకుల స్టాక్ లు క‌లిసి ఒక ఇండెక్స్ గా ఉంటాయి. దీనిని బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అంటారు. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లో నెల‌కు రూ.500 నుంచి పెట్టుబ‌డి ప్రారంభిచ‌వ‌చ్చు. అవ‌స‌రం లేద‌నుకున్నప్పుడు మినిమ‌మ్ 500 రూపాయ‌ల‌తో ఎగ్జిట్ అవ్వొచ్చు. నెల‌కు 1000 రూపాయ‌ల‌తో ఒక వ్యక్తి ఇన్వెస్టెమెంట్ ప్రారంభిస్తే.. 30 సంవ‌త్సరాల‌కు అది.. రూ. 2 కోట్ల 29 ల‌క్షలు అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబ‌డి పెట్టే ముందు… డైరెక్ట్ ప్లాన్, గ్రోత్ ఆప్షన్ నే ఎంచుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మొత్తం ఫ‌ర్మార్మెన్స్ ప‌రిశీలిస్తే.. స‌గ‌టున 20 శాతం లాభాల్ని అందిచింది. ఆ లెక్కన నెల‌కు 1000 రూపాయ‌లు, 30 సంవ‌త్సరాలు పెట్టుబ‌డి పెడితే.. 2కోట్ల 29 ల‌క్షలు మ‌న‌కు ల‌భిస్తుంది.

పాజిటివ్ అంశం:

  1. 500 తో నెల‌వారీగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వార పెట్టుబ‌డి పెట్టొచ్చు.
  2. ఎప్పుడైన మ‌న పెట్టుబ‌డిని వెన‌క్కి తీసుకోవ‌చ్చు.
  3. బ్యాంక్ నిఫ్టీ స‌గ‌టున 20 శాతం లాభాల్ని ఇప్పటి వ‌ర‌కు అందించింది.
  4. ఎక్కువ కాలం నెల‌వారీగా పెట్టుబ‌డి పెట్టే వారికి మంచి లాభాల్ని ఇస్తుంది.
  5. మ‌న పెట్టుబ‌డిని స్టాక్ మార్కెట్ లో మంచి అనుభ‌వం ఉన్న నిష్ణాతులైన ఫండ్ మేనేజ‌ర్లు నిర్వహిస్తారు. మ‌న‌కు రీస‌ర్చ్ చేసి పెట్టుబ‌డి పెట్టేంత శ్రమ ఉండ‌దు.

నెగిటివ్ అంశం:

  1. మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్స్ కేటాయించిన త‌ర్వాత మూడు నెల‌ల‌లోపు పెట్టుబ‌డి వెన‌క్కి తీసుకుంటే.. 1 శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. మూడు నెల‌ల త‌ర్వాత అయితే.. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండ‌దు.
  2. మ్యూచువ‌ల్ ఫండ్ స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెరిగితే మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డికి లాభం వ‌స్తుంది. త‌గ్గితే న‌ష్టం వ‌స్తుంది.
  3. మ్యూచువ‌ల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ కు సంబంధించినది కాబ‌ట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే రివార్డ్ కూడ ఎక్కువగా ఉంటుంది.
  4. స్టాక్ మార్కెట్ రిస్క్ కు లోబ‌డి మ్యూచువ‌ల్ ఫండ్స్ ప‌నితీరు ఉంటుంది.

బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లోని బ్యాంకులు:

  1. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్
  2. ఐసీఐసీఐ బ్యాంక్
  3. ఏక్సిస్ బ్యాంక్
  4. కోట‌క్ మ‌హింద్రా బ్యాంక్
  5. ఇండ‌స్ ఇండ్ బ్యాంక్
  6. ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్
  7. ఎస్బీఐ
  8. ఫెడ‌ర‌ల్ బ్యాంక్

గ‌మ‌నిక‌: మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డి, లాభం స్టాక్ మార్కెట్ రిస్క్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే.. మీకు ద‌గ్గర్లోని ఫైనాన్సియ‌ల్ నిపుణుడి స‌ల‌హా తీసుకున్న త‌ర్వాతే పెట్టుబ‌డి పెట్టండి

About Author