‘మలబార్’లో వడ్డాణోత్సవం..
1 min read- కర్నూలులో వడ్డాణం మరియు నెక్లెస్ ఉత్సవ కాంపెయిన్‌ను ప్రారంభించిన డా. సావిత్రి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: భారతదేశంలో అతి పెద్ద బంగారు వ్యాపార సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ శరవేగంగా విస్తరిస్తోంది. బంగారు ప్రియుల అభిరుచికి తగ్గట్టు వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ముందుంటోంది. బుధవారం కర్నూలు షోరూంలో వడ్డాణోత్సవం మరియు నెక్లెస్ ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుశీల నేత్రాలయ మరియు మెటర్నటి హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. సావిత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. సావిత్రి మాట్లాడుతూ కొనుగోలుదారులకు అనుగుణంగా… కావల్సిన డిజైన్లలో బంగారు ఆభరణాలను తక్కువ ధరకు విక్రయించడం అభినందనీయమన్నారు. అంతేకాక వచ్చిన లాభాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం నిర్వహకులను ప్రశంసలతో కొనియాడారు. అనంతరం షోరూం మేనేజర్ మాట్లాడుతూ తమ సంస్థ వినియోగదారుల అభిప్రాయం, ఇష్టం.. అభిరుచులను దృష్టిలో పెట్టుకుని బంగారు ఆభరణాలను వివిధ డిజైన్లలో తయారు చేస్తోందన్నారు. ఇతర బంగారు వ్యాపార సంస్థలతో పోలిస్తే…. మలబార్ గోల్డ్‌లో క్వాలిటీ.. క్వంటిటీతోపాటు తక్కువ ధరకు బంగారు ఆభరణాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో నేషనల్ అవార్డు గ్రహిత షేక్ జాఫ్రీన్, కర్నూలు బ్రాంచ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా తదితరులు పాల్గొన్నారు.