గేట్ లో అవుకు వాసికి ర్యాంక్
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం అవుకు మండలం ఫిబ్రవరి 4న నిర్వహించిన గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్ష ఫలితాల్లో అవుకు పట్టణానికి చెందిన సాత్రి ప్రమోద్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి 384 ర్యాంకు సాధించాడు. ప్రమోద్ కుమార్ తండ్రి సాత్రి రామయ్య పాత్రికేయ వృత్తిలో బనగానపల్లి నియోజకవర్గంలో ఓ ప్రముఖ చానల్లో పనిచేస్తున్నాడు. సాత్రి రామయ్య అనురాధ దంపతులకు ఇద్దరు కుమారుల సంతానం. వీరిలో ద్వితీయ కుమారుడు ప్రమోద్ కుమార్.ఇతను ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి వరకు హైదరాబాదులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో (హెచ్పిఎస్, బేగంపేట్) లో పదవ తరగతి లో 93.8% ఉత్తీర్ణత సాధించాడు.ట్రిపుల్ ఐటీ బాసరలో బీటెక్ సిఎస్సి92.4% మార్కులు సాధించాడు.దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో 8 లక్షల మంది హాజరవగా అవుకు చెందిన ఈ యువకుడు అరుదైన రికార్డ్ స్థాయిలో ర్యాంక్ సాధించాడు.తమ కుమారుడు ర్యాంకు సాధించాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు,మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి, గూడాల సోదరులు, పలువురు ప్రముఖ నాయకులు ఫోన్లో ప్రమోద్ కుమార్ ను అభినందించారు.