అకాల వర్షం – అపార నష్టం
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : మండలంలో గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం తెల్లవారుఝాము వరకు గాలి,వాన బీభత్సం సృష్టించింది.ప్రధానంగా మండలంలోని నేలంపాడు,పెద్దబోదనం,చిన్నబోధనం,ముత్యాలపాడు,ఎం తాండా,శెట్టివీడు,రాంపల్లె తదితర గ్రామాలలో చేతికొచ్చిన మొక్క జొన్న,కొర్ర,తదితర పైర్లు నేలవాలాయి.గాలి,వాన బీభత్సానికి మునగ,బొప్పాయి తదితర పంటలు నేల కూలీ రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.మండలంలో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా మొక్క జొన్న,500 ఎకరాలకు పైగా కొర్ర పంటలు దెబ్బ తినడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. మండలంలో వర్షానికి దెబ్బ తిన్న పంటలను ఆయా గ్రామాల వ్యవసాయ,ఉధ్యాన సహాయకులు పరిశీలించారు.ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.