భారీ వర్షం వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
1 min read-ఎకరాకు ఐదు లక్షలు నష్టపరహారం చెల్లించాలి: వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వడగండ్ల వర్షానికి నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు మూడు లక్షలుమొక్కజొన్న రైతులకు ఎకరాకు రెండు లక్షలు నష్టపరిహారం ఇచ్చి తక్షణమే ప్రభుత్వం రైతులను కౌలు రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు మద్దిలేటి,రమణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకులు పి విజయ శేఖర్ మరియు మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ లకు వినతి పత్రాన్ని అందజేశారు.హార్టికల్చర్ అధికారి తేజస్విని రైతుల పంటను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల మిర్చి రైతులు మొక్కజొన్న పూర్తిగా పంట నష్టం వాటిల్లిందని మిడుతూరు మండలంలో జలకనూరు తలముడిపి చింతలపల్లి కాజీపేట దేవనూరు కడుమూరు గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని రబీ పంట వేసిన మిరప రైతులు పంట పూర్తిగా కాయలు రాలి కింద పడడం జరిగిందని మొక్కజొన్న నే లమట్ట మైందన్నారు.అనంతరం సచివాలయం దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో పంట నష్టపోయిన మిర్చి మొక్కజొన్న రైతులతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి ఖర్చు అయిందని రైతుకు పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానతో పూర్తిగా కాయలు రాలిపోయి నేలమట్టమై పోయాయన్నారు దీనివల్ల రైతుకు ఎకరాకు ఐదు లక్షలు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జలకనూర్ ఎంపీటీసీ హరి సర్వోత్తమ రెడ్డి,లింగారెడ్డి,ఎల్లయ్య, వెంకటేశ్వర్లు,సుబ్బయ్య,కిరణ్, ఎల్లనాగన్న,శ్రీనివాసులు,శంకర్,చంద్ర తదితరులు పాల్గొన్నారు.