చేయి చేయి కలుపుదాం..ఉద్యమానికి సహకరిద్దాం
1 min read– ఏపీజేఏసీ అమరావతి, కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో 9వ రోజు నిరసనలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏపీ జేఏసీ అమరావతి, కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉద్యమం శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు ” చేయి చేయి కలుపుదాం ” ఉద్యమానికి సహకరిద్దాము అనే నినాదాన్ని అందుకున్నామని ఏపీజేఏసీ అమరావతి- కర్నూలు జిల్లా చైర్మన్ శ్రీ గిరి కుమార్ రెడ్డి , తప్పని పరిస్థితుల్లోనే ఉద్యమానికి సిద్ధమయ్యాంఉద్యోగుల ఆత్మ గౌరవమే మా నినాదంకడుపు కాలి రోడ్డెక్కాం.. ప్రతి ఉద్యోగీ కదలిరావాలని పిలుపు ఇచ్చాడు. ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే అమలు కాకపోవడంతో ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉద్యమానికి సిద్ధమయ్యామని, ఇది ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన అని ఏపీ జేఏసీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కర్నూలు జిల్లా అసోసియేట్ చైర్మన్, శ్రీ.నాగరమణయ్య, APJAC అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వై. కృష్ణ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ జీతాభత్యాల కోసం ఎదురుచూస్తూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని అప్పుల వాళ్ల దగ్గర తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. కనీసం జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని వివరించారు. మందుల బిళ్లలు అయిపోయి ప్రతి రోజూ పెన్షన్ డబ్బులు పడ్డాయో, లేదో అని కళ్లలో వత్తులు వేసుకుని విశ్రాంత ఉద్యోగులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఉందని వివరించారు. అరియర్స్ , డీఏ బకాయిలు, కొత్త డీఏ, లీవ్ ఎస్ క్యాష్ మెంట్లు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదని ప్రశ్నించారు. వీటిపై లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ముందుగా AP JAC అమరావతి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమమై కదులుతామని హెచ్చరించారు. ఇది ఉద్యోగుల ఆత్మ గౌరవ ఉద్యమమని స్పష్టం చేశారు. కడుపు నిండి కాదని, కడుపు మండి ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని, ఈ కారణంగా ప్రజలెవరైనా ఇబ్బందులు పడితే.. అది ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి ఉద్యోగీ ఉద్యమ జెండా పట్టుకుని హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కె.వై.కృష్ణ, అసోసియేట్ ఛైర్మన్, శ్రీ.నాగ రమణయ్య, నాయకులు ఏపీ జేఏసీ నాయకులు శ్రీ గిడ్డయ్య, క్లాస్ IV ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ మద్దిలేటి, శ్రీమతి.సులోచనమ్మ, శ్రీ.ఎ.వి.రెడ్డి, APTD, రెవెన్యూ, ఇంజినీరింగ్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, క్లాస్ 4 ఎంప్లాయీస్, కోఆపరేటివ్, కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్,గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ , వివిధ ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి. ఈ రోజు కార్యాలయలకు వెళ్లి ఉద్యోగుల తో ఇకపై నిరసన ద్వారానే సాధించుకుంటామని స్పష్టం చేస్తూ ఉద్యమానికి ముందుకొచ్చిన ఏపీజేఏసీ అమరావతి తో అన్ని సంఘాలు చేతులూ కలుస్తున్నాయని, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.