అమ్మవారిశాలలో ఘనంగా సామూహిక గజగౌరి వ్రతం
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లి: పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం ఉదయం మొట్టమొదటి సారిగా సామూహిక గజగౌరీ వ్రత పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య, ఆర్యవైశ్య మహిళ ,యువజన ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య మహిళలు ఈ వ్రత పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వ్రతపూజ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. మహిళలు మాత్రమే ఆచరించే ఈ వ్రతపూజ వలన ఆయా వ్రతంలో పాల్గొనే మహిళల కుటుంబంలో వంశాభివృద్ది, ఆర్థికపరమైన వృద్ధి, రాజయోగం కలుగుతుందని ఆమ్మవారిశాల పురోహితులు రుద్రానంద చక్రవర్తి, విష్ణుమోహన రంగనాథ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి బండారు లలిత, ఆర్యవైశ్య సంఘము గౌరవధ్యక్షురాలు నూకల వాసంతి, నూకల నిర్మల, ఇల్లూరు విజయశాంతి, కేతేపల్లి లక్ష్మీ, వేముల శోభాదేవి, ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు పసుపుల సుబ్బసత్యనారాయణ, అధ్యక్ధుడు కెతేపల్లె శివాచంద్రయ్య, ట్రెజర కాసుల జంగం శెట్టి, నూకల వెంకటసుబ్బయ్య, ఎం భరతుడు, వేముల మురళి, గుండా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.