PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి పట్టిష్టమైన చర్యలు చేపట్టండి

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారుశుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ ఓర్వకల్లు వద్ద అండర్ పాస్ నిర్మాణం కొరకు సంబంధించిన డిజైన్స్ ఎస్టిమేషన్స్ పనులు ఎంతవరకు వచ్చాయి అని నేషనల్ హైవే అధికారులను అడగగా నేషనల్ హైవే వారు స్పందిస్తూ అందుకు సంబంధించిన ఎస్టిమేషన్స్ NHAI వారికి పంపించడం జరిగిందని పరిశీలిస్తున్నారని జిల్లా కలెక్టర్ గారికి తెలిపారు. సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద ఐరన్ బ్యారికేడింగ్ పనులు పూర్తి చేయలేదని డీఎస్పీ మరియు డిటిసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకరాగ ద్విచక్ర వాహనాలు సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ మధ్యలో ప్రవేశించకుండా ఐరన్ బ్యారికేడింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. నేషనల్ హైవే 44 నందు సోలార్ లైట్లు 8 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దృష్టికి నేషనల్ హైవే అధికారులు తీసుకొని వచ్చారు. ఓర్వకల్లు నందు ఉన్న జగనన్న కాలనీలకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు నేరుగా ఉందని అలా కాకుండా సర్వీసు రోడ్డు ద్వారా కాలనీలకు అప్రోచ్ రోడ్డు కల్పించేందుకు ట్రాఫిక్, రవాణ, హౌసింగ్ శాఖ వారు కలిసి తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బళ్ళారి చౌరస్తా ప్రాంతంలో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని మున్సిపల్ కమీషనర్ ను అడగగా ఎలక్షన్ కోడ్ పూర్తి అవ్వగానే టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ గారికి వివరించారు.నగరంలో సిసి కెమెరాల మరమ్మత్తులు వచ్చే సమావేశం నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కి వివరించారు. వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి దగ్గర 4 లైన్ పనులు ఎంత వరకు వచ్చాయని సంబంధిత అధికారిని అడుగగా వారు స్పందిస్తూ రోడ్ సేఫ్టీ ఆడిటర్ ద్వారా పరిశీలించడం జరిగిందని అందుకు వారు స్పందిస్తూ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన తర్వాత 4 లైన్ మార్కింగ్స్ కు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గారికి వివరించారు. రోడ్ల మీద పాట్ హోల్స్ గుర్తించి వాటి చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రోడ్ల మీద ప్రమాదాలకు గురైన వారిని ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న లేకున్నా వారికి అత్యవసర వైద్య సేవలు ఆరోగ్య శ్రీ కింద అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రఘును జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమైన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా వాహనదారులకు ఆడియో సిస్టం ద్వారా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ డీఎస్పీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో వారానికి ఒకసారి ట్రాఫిక్ నియమ నిబంధనలపైన విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 2023 నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీధర్ వివరించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ బిర్లాగేట్, వినాయక ఘాట్,జిజిహెచ్, మెడికల్ కాలేజ్ ఫుట్ పాత్ పరిసరాలలో అనుమతులు లేకుండా షాపులు నిర్వహిస్తున్నారని అటువంటి వాటిపై ట్రాఫిక్ మరియు మున్సిపల్ శాఖ వారు డ్రైవ్ నిర్వహించేలా ప్రణాళిక తయారు చేసుకుందాం అన్నారు. అదే విధంగా శ్రీరామ థియేటర్, బళ్లారి చౌరస్తా పరిసరాలలో ఆటోరిక్షాలు ఎక్కువ శాతం నిల్పకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ డిఎస్పిని ఆదేశించారు.ఈ సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీధర్, ఆర్టిఓ రమేష్, ఆర్టీసి అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నేషనల్ హైవే కర్నూలు, అనంతపురం జిల్లాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author