PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

1 min read

– ఏపీజేఏసీ అమరావతి నేతల హెచ్చరిక..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి వివి. మురళీకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ భవనంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ కె.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత ఓపిఎస్ విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ హెచ్ఎస్ లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలన్నారు.ఉద్యోగస్తులకు ఆరోగ్య పరంగా సమస్యలు వస్తే ఈహెచ్ఎస్ లో సక్రమంగా సేవలు అందట్లేదని వాపోయారు. అంతేకాకుండా ఉద్యోగస్తులు డిమాండ్లన్నిటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.ఏపీ జేఏసీ  జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ ఇతర సంఘాల వారిని కూడా ఉద్యమంలో కలిసిరావాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఏప్రిల్ 5 వరకు నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరై నిరసనను ఈప్రభుత్వానికి తెలియజేయాలని అలాగే  ఏప్రిల్ 21 తేది నుండి వర్క్ టు రూల్ పాటించాలని అందరిని కోరారు.ప్రభుత్వం ఈనెల ఆఖరి లోపల బకాయిలు 3 వేల కోట్లు చెల్లిస్తామని ఒప్పందం చేసియున్నారు.వాటితోపాటు సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించవలసిన 2,600 కోట్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలగే ఇన్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి డీఏ ఎరియర్స్,పిఎర్సీ ఎరియర్స్ ఇంత మొత్తాన్ని  ఏవిధంగా చేల్లిస్తారో షెడ్యుల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వ హామీ ఇచ్చినా సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు పరచాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరించాలని, ఔట్సౌర్సింగ్ ఉద్యోగులకు జీతబత్యాలు పెంచాలని, అదేవిధముగా గ్రామ,వార్డ్ సచివాలయ ఉద్యోగుల రేగ్యులైజేషన్ లో జరిగిన జాప్యం 9 నెలలను ఇన్ సర్వీస్ గా ప్రకటించి దానికి గాను జీతాలు చెల్లించాలని అదేవిదంగా గ్రామ,వార్డ్ సచివాలయ ఉద్యోగులకు వెంటనే బదిలీలు చెపట్టాలని, వారికీ కూడా వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ లో ఉన్న డిఎ లను వెంటనే ప్రకటించాలని కోరారు.ఎపి జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో బాగంగా ఉద్యోగులను ఉద్యమానికి సమాయత్తం చేయడం కోసం అన్ని జిల్లాలలో పర్యటించడం జరిగిందని,దానిలో భాగంగా స్థానిక ఆర్టీసీ గ్యారేజ్, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, డిఆర్డిఏ ఏలూరు లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యలయాలలో విచ్చేసి అక్కడ ఉద్యోగులను ఉద్యమంలో కలసికట్టుగా అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో ఏపీ జేఏసీ ఆమరావతి, రాష్ట్ర కోశాధికారి మురళి కృష్ణ నాయుడు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి.కిషొర్ కుమార్,జిల్లా జనరల్ సెక్రటరి బి. రాంబాబు,రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా సెక్రటరి ఏ. ప్రమోద్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వర్మ ,డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేణు గోపాల్,గ్రామ వార్డ్ సచివాలయల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కమల్, సాయినాద్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్మి, వివిధ ఉద్యోగ సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.

About Author