ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
1 min read– విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఏలూరు జిల్లా విశ్రాంత ఉద్యోగులు, ఏలూరు నగరపాలక సంస్థ విశ్రాంత ఉద్యోగులు సంయుక్తముగా కోట దిబ్బ విశ్రాంత ఉద్యోగులు భవనం వద్ద శనివారం విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ” ధర్నా”నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీని పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2018 జూలై 1వ తేదీ నుండి రావలసిన 2 డి.ఆర్ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టి కుటుంబ పెన్షనర్లకు వర్తింప చేయాలన్నారు.అనంతరం తాసిల్దార్, ఏలూరు ఎటిఓ కి సమస్యలతో కూడిన విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె. మహా లక్ష్మి, డి. గంగాదర్,అర్. వెంకటేశ్వర్లు, ఎల్.పాండు రంగారావు,ఎన్ వి.మధుసూదనరావు, ఏలూరు నగర పాలక సంస్థ విశ్రాంత ఉద్యోగులు ఎ.అప్పలరాజు,పి. వి.రమణ,ఎస్ ఎంవి.సుబ్బా రావు, కె.రామ కృష్ణ రావు,బిపి. రాజు,బి. నాగేశ్వర రావు,ఎన్. ఏసు, డి.అసిరప్పడు, ఎ.అప్పా రావు, హరి బహు దుర్ తదితరులు పాల్గొన్నారు.