రాజంపేటలో అంబరాన్నంటిన టీ డీ పీ సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా : ఇటీవల రాష్ట్రంలో జరిగిన పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని చోట్లా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం తో కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి.సోదర సమానులు, ఆత్మీయులు పులివెందుల ప్రాంత నివాసి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా గెలుపొందడం హర్షించదగిన విషయమని చమర్తి జగన్ మోహన్ రాజు కొనియాడారు.శనివారం నాడు రాజంపేట పట్టణంలో ప్రముఖ విద్యావేత్త,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆదేశానుసారం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సైకో,తుగ్లక్ పాలనకు చెంపపెట్టు లాంటివని,భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి పులివెందులతో పాటు,రాష్ట్రంలోని 175 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.నవ్యాంధ్ర స్ఫూర్తి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి చెంది, సుభిక్షంగా ఉండడం తో పాటు అన్ని రంగాల్లో ముందుకుదూసుకుపోతుందన్నారు. నియంత పాలన కొనసాగించే జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు ఈ ఫలితాలు చెంప పెట్టులాంటివని వారు చేసే పరిపాలన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆరోపించారు. ఇప్పటికైనా కక్ష్య సాధింపు, నియంత, అవినీతి, అరాచక పాలనను పక్కన పెట్టి, ప్రజలు నీకు ఇచ్చిన అవకాశాన్ని కొద్ది నెలలైనా ప్రజాస్వామ్య పాలనను కొనసాగించాలని హితవు పలికారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ధనాన్ని విచ్చలవిడిగా పంచి,ఓట్లు కొన్నప్పటికి విద్యావంతులు,మేధావులు సరియైన తీర్పు ఇచ్చారన్నారుఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దల సాగర్, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సమ్మెట శివప్రసాద్,పార్టీ నాయకులు సుబ్బరాజు,పరుశురాం,మహిళా ఉపాధ్యక్షురాలు వాణి, తెలుగు యువత నాయకులు రాము యాదవ్, రాజంపేట పార్లమెంట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ మన్యం కరిముల్లా TNSF పార్లమెంట్ అధ్యక్షుడు పోలీ శివకుమార్,మండల ఉపాధ్యక్షుడు రాయపరాజు సతీష్, సూర్యరాజు, వినోద్ రెడ్డి, తోట శివశంకర్, సుదర్శన్, సోహెల్, నాగేంద్ర, వెంకటేష్,రాజేష్ వర్మ, అమీర్ తదితరులు పాల్గొన్నారు.