అకాలవర్షంలో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి
1 min read–నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరువెంకట్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులుగౌరు వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని మంచాలకట్ట గ్రామంలో ఆదివారం నాడు అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న. మిరప. అరటి వివిధ రకాల పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కురసడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది రైతులు పంటలు కోసి కళాలలో ఆరవేయగా కురిసిన వర్షానికి పంటలు రంగు మారడంతో వ్యాపారస్తులు రంగు మారిన పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతుల పంటలు పంటకోతచివరి దశలో ఉన్న సమయంలో చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది అని రైతులు ఆవేదనగా తెలిపారు. గతంలో తుఫాను రావడంతో రైతులుతీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించి వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి. మురళీధర్ రెడ్డి. నారాయణరెడ్డి. రైతులు పాల్గొన్నారు.