PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవలు నిర్వహిస్తాం

1 min read

పల్లెవెలుగు వెబ బనగానపల్లె : పట్టణం హై స్కూల్ గ్రౌండ్ ఆవరణంలో స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి కాటసాని ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓపెన్ వాలీబాల్ పోటీలను ఈనెల 18వ తేదీన పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో 22 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి 30 వేల రూపాయలు నగదు ట్రోపి బహుమతిని చెన్నైకి చెందిన ఐరన్ మాన్ టీం, రెండవ బహుమతి 20000 రూపాయల నగదు మరియు ట్రోపి నీ బనగానపల్లె పట్టణానికి చెందిన ఇబ్రహీం టీం, మూడవ బహుమతి 10000 రూపాయల నగదు మరియు ట్రోపీని గుంటూరుకు చెందిన తిరుపతి టీం సభ్యులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మరియు కాటసాని ఓబుల్ రెడ్డి ట్రోఫీ మరియు నగదును అందజేశారు. ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ చివరి రోజున బనగానపల్లె సీనియర్ క్రికెట్ ప్లేయర్ మహమూద్ క్రీడాకారులకు అందరికి భోజన వసతి కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో కల్లా వాలీబాల్ ఆట చాలా ప్రాముఖ్యత అని ఈ క్రీడలో మనిషి శరీరం మొత్తం కూడా వ్యాయామం చేయడం జరుగుతుందని కాబట్టి వాలీబాల్ ఆట వల్ల మనిషికి మానసిక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఒక క్రీడాభిమానిగా తాను క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగానే తన పెద్ద కుమారుడు స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన రెండవ కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో క్రీడా కార్యక్రమాలతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పారు. క్రీడాకారులకు క్రీడలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న కూడా తనకు గాని తన కుమారుడు కారసాన్ని ఓబుల్ రెడ్డి దృష్టికి గాని తీసుకువస్తే ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ను ఇంత దిగ్విజయంగా ఆర్గనైజేషన్ చేసినటువంటి అత్తార్ ఆఖిల్ ,సుదర్శన్ రెడ్డి, కోనేటి దుర్గా, నీలి శివ కృష్ణ, ఫెరోజ్ మరియు ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. రాబోయే కాలంలో స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. క్రీడల్లో గెలుపుఓటములనుసమానంగా తీసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రామిరెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు ఎర్రగుడి సుబ్బారెడ్డి, చెర్లో కొత్తూరు మాధవరెడ్డి, షరీఫ్, రమణ, మరియు ఆర్గనైజర్లు సుదర్శన్ రెడ్డి, నీలి శివకృష్ణ, ఇబ్రహీం పకీరయ్య, రాజు, ప్రసాద్ మాభాష, ఢిల్లీ చోటుక్రీడాకారులు,క్రీడాభిమానులు తదితరులుపాల్గొన్నారు.

About Author