కౌమార సాధికారత .. బాల్య వివాహాల నివారణ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం జీవ సుధా ట్రైనింగ్ సెంటర్, కర్నూలులో UNICEF, హైదరాబాద్, ICDS, కర్నూలు వారు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ప్రారంభోత్సవం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు పాల్గొని బాల్య వివాహాల నిరోధక చట్టం, లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయంను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు టౌన్ డిఎస్‌పి., శ్రీ కే.వి. మహేశ్ గారు, పిడి., ఐసిషడిఎస్., హెల్త్, పోలీసు ఎడ్యుకేషన్ ఇంకా సంబంధిత శాఖల వాళ్ళు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్స్ గా మేరీ జాన్, కృష్ణవేణి పాల్గొని బాల్య వివాహాల నిరోధక చట్టం, సవరణలు, గురించి వివరించారు. భోజనంతరం ప్రతి ఒక్క గ్రూప్ ద్వారా రోల్ ప్లే, కొన్ని కార్యాకలపాలు కూడా చేయించారు.