యువత చేతిలోనే దేశ భవిష్యత్
1 min read– క్రికెట్ పోటీ బహుమతుల ప్రధానోత్సవంలో సాయినాథ్ శర్మ యువతకు పిలుపు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : యువత చేతిలోనే మన దేశ భవిష్యత్ ఆదారిపడి ఉందని తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు వల్లూరు మండలం అచ్చింత రాయి పల్లె వద్ద వి కె ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీకెట్ ముగింపు పోటీల సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయినాథ్ శర్మ కు వల్లూరు మండల యువకులు మంగళ వాయిద్యాలతో బాణాసంచా పెంచుతూ పూలు జల్లుతూ క్రేన్ ద్వారా పూలమలాంకృతులు చేసి ఘన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయినాథ్ శర్మ మాట్లాడుతూ యువకులు కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఎటువంటి విభేదాలు ఇటువంటి క్రీడా స్ఫూర్తిని చాటడం అభినందనీయమన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో యువత చైతన్యవంతులై ఇచ్చిన తీర్పు చాలా గొప్ప ఎన్నికల తీర్పుగా ఆయన అభివర్ణించారు. యువత చైతన్యవంతులై ఉత్సాహంగా ముందుకు కదిలినప్పుడే దేశ అభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు. గ్రామస్థాయిలో క్రీడా నైపుణ్యం పెంపొందించడానికి వీకే యూత్ ఆర్మీ వారు క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. క్రికెట్ పోటీలలో ప్రథమ బహుమతి పొందినజట్టు కు యాభై వేల రూపాయలు రన్నర్స్ గా నిలిచిన జట్టుకు ముప్పై వేల రూపాయలు బహుమతిగా ఆయన వి. కే ఆర్మీ యూత్ తరుపున ఆయన అందించారు.ఈ కార్యక్రమంలో వల్లూరు మండల యువజన నాయకులు ధనుంజయరెడ్డి పవన్ అశోక్. సతీష్, వివేకానంద హైస్కూల్ కస్పాండెంట్ రామ సుబ్బారెడ్డి, రైతు సంఘం నాయకులు కల్లూరు జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ , MPTC ఆచార్య రాజా, సిద్ధారెడ్డి , లింగాల వెంకటరమణ రమణారెడ్డి, విన్నేర్స్ రన్నర్స్ కెప్టెన్లు రామాంజినేయల రెడ్డి ధనుంజయ రెడ్డి మాచునురు చౌటపల్లి ఎల్ వి రామముని రెడ్డి అంకిరెడ్డి, రాళ్లపల్లి శివారెడ్డి బాలకృష్ణ రెడ్డి రాయచోటి సుధాకర్ నాగరాజ ఆచారి మహమ్మద్ రఫీ తదితర నాయకులు పాల్గొన్నారు.