అక్రమ అరెస్టులు..ఉద్యమాలను ఆపలేవు
1 min read– అంగన్వాడీల సమస్యలను పరిష్కరించండి
– ఏపీ అంగన్వాడి వర్కర్స్& హెల్పర్స్ యూనియన్(CITU)
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అంగన్వాడి కార్యకర్త ల సమస్యలను పరిష్కారం చేయకుండా అంగన్వాడీల పోరాటాన్ని పోలీస్ దాడులతో, అక్రమ అరెస్టులతో అణచి వేయడం ప్రజా ప్రభుత్వం చేసే పని కాదని అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవని అంగన్వాడి యూనియన్ తో ప్రభుత్వం చర్చలు జరిపి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పత్తికొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎస్ జ్యోతిలక్ష్మి, వెంకట లక్ష్మీ లు డిమాండ్ చేశారు.సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం చలో అసెంబ్లీకి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకు నిరసనగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు యూనియన్ నాయకురాలు సరోజ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు ఇస్తామని చెప్పడంతో అంగన్వాడీలు ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మి ఓట్లు వేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక వెయ్యి రూపాయలు పెంచి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను దూరం చేశారని, రకరకాల యాప్ లతో అంగన్వాడీలపై పనిబారాన్ని పెంచి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు జీవో నెంబర్ ఒకటి తీసుకువచ్చి ప్రజలకు నిరసన తెలియజేసే హక్కును హరిస్తున్నారనీ,అంగన్వాడీలు సమస్యల పైన ఇప్పటికి అనేక సార్లు నిరసన తెలియజేసిన ప్రభుత్వం స్పందించకపోవడంతో చలో విజయవాడ ధర్నాకు పిలుపునిస్తే మహిళల పై కనీసమైన మానవత్వం లేకుండా అంగన్వాడి కార్యకర్తలను ఉగ్రవాదుల్లాగా దేశద్రోహులు లాగా నేరస్తులకు రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో అరెస్టులు చేసి రాత్రులు కూడా కూడా వదలకుండా పోలీస్ స్టేషన్లో నిర్భందించడం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనకు నిదర్శనం అన్నారు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మానవత్వంతో అంగన్వాడీలతో చర్చించి వాటి సమస్యలను పరిష్కరించాలి తప్ప అక్రమ అరెస్టులు ఉద్యమాల ఆపలేవని అంగన్వాడి సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు అనంతరం తాసిల్దార్ సుదర్శనం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, మంగమ్మ, సరస్వతి, హుస్సేన్ అమ్మ, లక్ష్మీదేవి, భార్గవి ,జానకి, వనిత, ప్యార్ బి తది తరులు పాల్గొన్నారు.