PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యాయం జరగకపోతే ఏప్రిల్ 6 నుండి నిరవధిక నిరాహార దీక్షలు

1 min read

– పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు స్థానిక రాజా రెడ్డి నగర్ లబ్ధిదారులకు న్యాయం చేకూరెందుకూ సిట్ ( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ను ఏర్పాటు చేయాలని ఇదివరకే మూడు నెలల క్రితం ఆర్డీఓ మోహన్ దాస్ గారికి అన్ని ఆధారాలు సమర్పించి కోరడం జరిగింది. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితురాలు లక్ష్మి దేవి తో కలిసి ఏప్రిల్ 6 నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని ఆర్డీఓ మోహన్ దాస్ కు మెమొరాండం అందజేశారు.ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత పిసిసి గిడుగు రుద్రరాజు గారు తదితరులు పత్తికొండ లో అట్టహాసంగా ప్రారంభించిన రాజా రెడ్డి నగర్ ఇప్పుడు ఏమైనట్టు, లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ళు ఎక్కడ? వారి పట్టా లిస్ట్ ఏమైనట్టు..?? RDO, MRO ఆఫీసులలో ఫైల్ మాయం అయ్యాయి, వారికి ఇళ్ళు కేటాయిస్తూ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఫేస్ త్రీ నుండి నిధులు కూడా మంజూరు అయ్యాయి. మరి వాటి సంగతి ఏమిటి, ఆ ఇళ్ళు ఇపుడు ఏమైనట్టు? అని ఆర్డీఓను ఆయన ప్రశ్నించారు. SIT ద్వారా, ఆర్టీఐ ద్వారా మరియు హౌసింగ్ కార్పొరేషన్ కు విన్నవిస్తే న్యాయం జరుగుతుంది అని ఆశించాము. కానీ ఇప్పటి వరకు ఏదీ జరగలేదు. లబ్ధిదారులకు సహాయం చేయండని, హౌసింగ్ కార్పొరేషన్ వారు డైరెక్షన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఫలితం లేదని అన్నారు. జీవిత కాలంలో ఒక్కసారే ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని, అది కాస్త స్థానిక అక్రమార్కుల వలన అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తిగా చట్ట ప్రకారం ఉల్లంఘన అని సెక్షన్ 201, పబ్లిక్ రికార్డ్స్ ఆక్ట్ 1993, రూల్స్ 97 ప్రకారం ఇది నేరం అని, మరి నిరుపేదలకు న్యాయం జరిగేది ఎలా అని స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో ఆర్డీఓ మోహన్ దాస్ గారిని అడిగారు. లబ్ధిదారులకు న్యాయం చేకూరేందుకు RDO గారి అధ్యక్షతన ఒక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వేసి రీసర్వే చేయించి, OTS ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఏప్రిల్ 5 వరకు వేచి చూస్తామని, అప్పటికి బాధితులకు న్యాయం జరగకపోతే ఏప్రిల్ 6 నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని ఆర్డీఓ గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులు లక్ష్మి దేవి, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

About Author