చిరుధాన్యాలతో వంట- వాటి ప్రాధాన్యత పై అవగాహన
1 min read– ఎంపీడీవో జి, సురేష్ బాబు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రతి ఒక్కరు చిరుధాన్యాల గురించి, అలాగే వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు అన్నారు, మంగళవారం ఆయన స్థానిక రెడ్డి వారి వీధిలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషకాహార -మాసోత్సవాలు కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు, పోషణ పక్వాడా ప్రోగ్రాము ఈనెల మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఈ ప్రోగ్రాములు గ్రామస్థాయిలో, అలాగే మండల స్థాయిలో ,జిల్లా స్థాయిలో, ప్రతిరోజు ఏదో క గ్రామంలో పోషకాహారం- అలాగే చిరుధాన్యాల ప్రత్యేకతలను గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు, అదే విధంగా ఏదో ఒక రకమైన యాక్టివిటీ కార్యక్రమాలు జరుపబడతాయన్నారు, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యము చిరుధాన్యాలతో వంటలు చేసుకోవడం వాటి యొక్క ప్రాధాన్యత ఉపయోగించే విధానం గురించి అంగన్వాడికి వచ్చే వారికి అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు జరుపబడతాయని ఆయన అన్నారు, చిరుధాన్యాల ద్వారా మంచి పోషకాలు లభించడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని , కాబట్టి ప్రజలు చిరుధాన్యాల వాడకం వంటకం గురించి తెలుసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్ గురమ్మ, ఎమ్మెస్ కేలు , అంగన్వాడి కార్యకర్తలు, తల్లులు పాల్గొనడం జరిగినది.