విద్యార్థిని విద్యార్థులకు రాగి జావా పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల పట్టణ జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకం లో భాగంగా మంగళవారం నాడు రాగి మాల్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని.వారంలో మూడు రోజులు పౌష్టిక ఆహారమైన రాగి మాల్ట్ అందించడం జరుగుతుందన్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థినీ విద్యార్థులు చదువుకోవాలనే లక్ష్యంతోనే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 15 వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని లక్ష్యంతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ లో పలు మార్పులు తీసుకురావడం జరిగిందని ఎండాకాలం ప్రారంభం కావడంతో విద్యార్థిని విద్యార్థులు పౌష్టికంగా ఉండాలని ఉద్దేశంతోనే రాగి మాల్ట్ ను అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు శ్రీ రాజరాజేశ్వరి పాఠశాల కరస్పాండెంట్ ఏం రామేశ్వరరావు ఉత్తీర్ణతలో మండలానికి మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు. జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.