‘వర్క్ టు రూల్’కు సహకరించండి..
1 min readకలెక్టర్‌ను కోరిన ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్:ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. అందులో భాగంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈ నెల 21 నుంచి ప్రతి ఉద్యోగి వర్క్ టు రూల్ పాటించాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి చరిత్రహీనులుగా మారొద్దని కోరారు ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి. మంగళవారం కర్నూలు కలెక్టర్ పి. కోటేశ్వర రావును ఆయన ఛాంబరులో APRSA సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. వర్క్ టు రూల్‌కు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. ఆ తరువాత జాయింట్ కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డికి, డీఆర్ఓ నాగేశ్వరరావు యాదవ్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం డ్వామా, డీఆర్డీఏ, రెవెన్యూ, ఐసీడీఎస్, విద్యాశాఖ తదితర శాఖల అధికారులకు వర్క్ టు రూల్ పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి మాట్లాడుతూ వర్క్ టు రూల్‌లో భాగంగా ప్రతి ఉద్యోగి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించాలని కోరారు. ఆ తరువాత ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో విధులు కొనసాగించరాదని, అలాచేస్తే డ్యాష్ బోర్డులో అది రిఫ్లెక్ట్ అవుతుందని వెల్లడించారు. సాయంత్రం 5 గంటల తరువాత విధులు నిర్వర్తిస్తే…ఏపీఆర్ఎస్ఏ నేతృత్వంలో చేపడుతున్న ఉద్యమం నీరుగారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.