PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ ఆహ్వానాన్ని స్వీకరించండి : మోమిన్.షబాన

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ ఆద్వరంలో రంజాన్ మాసంలో లో 30 రోజులు ఉపవాసం ఉండే వారి కోసం సహేరీ(పొద్దున భోజన ఏర్పాటు)ను ఆత్మకూర్ పట్టణ ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు & తెలంగాణ బీజేపీ మైనారిటీ మోర్చా కన్వీనర్ మోమిన్ షబాన తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబాన మాట్లాడుతూ ఇస్లాం శాంతిని బోధిస్తుందని ప్రతిఒక్కరు ప్రశాంతమైన జీవితం కొనసాగించాలన్నారు. ఉపవాస దీక్షలో ప్రతిఒక్కరు ప్రపంచ శాంతి కోసం ప్రార్తించాలన్నారు. ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా మాట్లాడుతూ రంజాన్ లో ఉదయం పూట వంట చేసుకోవడానికి ఇబ్బంది పడేవారు ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ వారిని ఉదయం 2 నుంచి 4 గంటల వరకు సంప్రదిస్తే నేరుగా వారి ఇంటి దగ్గరికి భోజనాలు తీసుకొని వెళ్లి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా షేక్.అహ్మద్, గౌస్ పీరా, ఫక్రుద్దీన్,అలిషేర్,సయ్యద్ మునీర్, మొమిన్ యూసుఫ్,జునైద్ బాషా, మున్నా, బాషా,ఇంతియాజ్ పాల్గొన్నారు.

About Author