జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాల జారీపై సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జనన, మరణాలు మరియు వివాహాల ధృవీకరణ పత్రాలను ప్రజలకు ఏ విధంగా జారీ చేయడంపై వివిధ శాఖలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు న్యాయ సేవ సదన్ నందు జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాలను ప్రజలకు ఏ విధంగా జారీ చేయడంపై, సకాలంలో అందజేయడానికి సంబంధించి మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులతో సమావేశం నిర్వహించినారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫారమ్‌లలో ఆయా సెక్షన్ల ప్రకారం నమోదు చేయవలయునన్నారు. జనన మరణాలను నమోదు చేయాల్సిన వ్యక్తులు ప్రత్యేక నిబంధనలు పాటించాలన్నారు. జనన మరణాల నమోదు ఆలస్యం చేయకూడదు అని చెప్పారు. పేరు లేకుండా ఏదైనా పిల్లల జననం నమోదు చేయబడితే, అటువంటి పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నిర్ణీత వ్యవధిలోపు పిల్లల పేరుకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్‌కు మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా అందించాలి మరియు ఆ తర్వాత రిజిస్ట్రార్ అటువంటి పేరును నమోదు చేయాలన్నారు. ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రార్‌కు మౌఖికంగా ఏదైనా సమాచారం ఇచ్చిన ప్రతి వ్యక్తి దీని తరపున నిర్వహించబడుతున్న రిజిస్టర్‌లో అతని పేరు, వివరణ మరియు నిస స్థలంలో వ్రాయాలన్నారు. ఈ సమావేశంలో కర్నూలు డి.పి.ఓ., శ్రీ టి. నాగరాజా నాయుడు, ఎం.హెచ్.ఓ., డా. కె. విశ్వేశ్వర రెడ్డి, అన్నీ మండలాల పంచాయత్ సెక్రెటరీస్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.