నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో నష్టపోయిన రైతుల జాబితాను తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నష్టపోయిన ప్రతి రైతుని వైయస్సార్ ప్రభుత్వం ఆదుకుంటుందని అసెంబ్లీలో తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈనెల 16వ తేదీన వడగండ్ల వాన అకాల వర్షం వల్ల వేలాది ఎకరాల మిర్చి మొక్కజొన్న వరి పంటలు దెబ్బ తినడం వల్ల చేతికి వచ్చిన పంటను రైతు నష్టపోవాల్సి వచ్చిందని ఆ రైతులను ఆదుకోవాలని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరడంతో వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వడగండ్ల అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల జాబితాను తయారు చేయమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అలాగే కేవలం పంట నష్టపరిహారమే కాకుండా పంట బీమాను సైతం వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు వేసిన పంటకు బీమా మొత్తాన్ని ఉచితంగా వైయస్సార్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టడం జరుగుతుంది కాబట్టి నష్టపోయిన ప్రతి రైతుకు పంట బీమా కూడా చెల్లించేటట్లు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు.