PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

1 min read

– తెలుగు యువత మాజీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు బీసీ విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ..

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె గ్రామానికి చెందిన కురువ వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అదేవిధంగా భవనం పైనుంచి కిందపడి మరణించిన బోయ పరమేష్ కుటుంబాలను పరామర్శించి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం తెలుగు యువత మాజీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు బీసీ విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి రామకృష్ణ గోనెగండ్ల మాజీ ఎంపీపీ హనుమంతు లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాముడు రంగముని, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, వేణుగోపాలచారి, వెంకటేశ్, యువ నాయకులు మనోహర్, నాగేషు, చంద్ర, వీరన్న, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author