మానవత్వం చాటుకున్న పట్టణ సీఐ
1 min readపల్లెవెలుగు వెబ్, కడప : రామాపురం మండలం చిట్లూరు గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ తన కుమారుడికి ఆరోగ్యం సరిగా లేకపోతే.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని బస్సు కోసం ఠాణా సర్కిల్ వద్ద వేచి చూస్తోంది. కర్ఫ్యూ నేపథ్యంలో వాహనాలు ఏవీ లేకపోవడంతో… తల్లి పిల్లలను గమనించిన పట్టణ సీఐ జి. రాజు వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి జ్యూస్ అందజేసి… వారి ఇంటి వద్ద విడిచి పెట్టి రావాలని సిబ్బందిని ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పట్టణ సీఐ మానవత్వం చూపడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు.