PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రవ్వలకొండ క్షేత్రంలో.. నేటి నుంచి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట

1 min read

– 27న దివ్య ప్రతిష్ట,కల్యాణోత్సవం
– ఆనందాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ జ్ఞానేశ్వరనందస్వామి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం రవ్వలకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ వీరప్పయ్య స్వామి ఆనంద్రాశ్రమం,గోశాల దేవస్థానముల వద్ద ఆనందాశ్రమ వ్యవస్థాపకులు ,పీఠాధిపతులు శ్రీ జ్ఞానేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 27 వరకు శ్రీ వీరప్పయ్య స్వామి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ దక్షిణామూర్తి స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్టు ఆనందాశ్రమం నిర్వాహకులు శ్రీ జ్ఞానేశ్వరానంద స్వామి శుక్రవారం తెలిపారు. కాలజ్ఞాన తత్వవేత్త, శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన బనగానపల్లె రవ్వలకొండపై ఒక గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించి ఆ కాలజ్ఞానం ప్రతులను తనకు గోవులకాపరిగా ఆశ్రయం ఇచ్చిన శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ నివాసమున్న ప్రాంతంలో ఒక నేల మాలిగలో కాలజ్ఞాన ప్రతులను దాచి ఉంచటంతో బనగానపల్లె బ్రహ్మంగారు నడయాడిన పవిత్రస్థలంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ కాలజ్ఞాన గుహలవద్ద ఆనందాశ్రమ వ్యవస్థాపకులు జ్ఞానేశ్వరానంద స్వామి దాతల సహకారంతో రూ.కోటి వ్యయంతో శ్రీ విరప్పయ్యస్వామి దేవస్తానము నిర్మించి విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. 25 న ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, శోభాయాత్ర, ప్రార్ధన, సూక్త, పఠనము సాయంత్రం 7 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అజస్ర దీపారాధన, అర్చక, ఆచార్య, యజమాన, దీక్షాచరణ, మృత్యుగ్రహణ, అంకురారోపణ, వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు పర్యగ్నికర్ణ. తీర్థ ప్రసాద వినియోగము,26 ఉదయం 7 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, పంచ అగ్ని ప్రణయనము, పంచగవ్యధివాసము, క్షీరాధి వాసము, జలాధివాసము, అధివాసాంగ హోమము, పంచ సూక్త హోమము, తీర్థ ప్రసాద వినియోగము. మధ్యాహ్నం మహాత్ములచే ఆధ్యాత్మిక సభ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ప్రతిష్ట మూల మూర్తుల గ్రామోత్సవము ప్రభుత భలిహరణ. 7 గంటలకు నవగ్రహ ఆరాధన, పంచసూక్త హోమములు,నవగ్రహ హోమము, మహాశాంతి హోమము, హొత్ర పఠనము, సర్వదైవత్య హోమము, సర్వదేవతా ఆరాధన, కుంభ కళాన్యాసము, ధాన్యాధివాసము,పుష్పాధివాసము చతురేద పారాయణ తీర్థ ప్రాసద వినియోగములు ఉంటాయ న్నారు.27న ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ధ్యానము, ధాతున్యాసము, రత్నన్యాసము, స్థాపన, మూహూర్త సమయమునకు, ఉదయం 9-42 ని.లకు విగ్రహ బింబ స్థాపన, కళాణ్యాసము దేనుధర్శనము, మహాపూర్ణాహుతి స్వామి వారి యొక్క దివ్య దర్శనము యజమాన ఆశీర్వచనము తీర్థ ప్రసాద వినియోగము ఉంటాయని ఆయన వివరించారు. అదేరోజు శ్రీశ్రీశ్రీ వీరప్పయ్య స్వామి వారి ఆనంద్రాశమ నూతన పీఠాధిపతి నిర్ణయ కార్యక్రమము మహాత్ములచే జరుగును.ఉదయం 11 గంటలకు గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణము మహోత్సవము శ్రీమాన్ పరాశరం రామక్రిష్ణమాచార్యులు (అమరావతి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తుల పెద్దఎత్తున తరలివచ్చిస్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

About Author