PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితం

1 min read

– క్షయ వ్యాధి నివారణకు అందరూ సహకరించాలి
– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
పల్లవెలుగు వెబ్ కర్నూలు: అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయబడతాయి ప్రజల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.శుక్రవారం నగరంలోని మెడికల్ కళాశాల ఆవరణంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయబడుతాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రతినెల 24వ తేదీన క్షయ నిర్మూలన దినాన్ని జరుపుకుంటామన్నారు.ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని పట్టి పీడిస్తున్న వ్యాధులలో క్షయ వ్యాధి ఒకటని అన్నారు. క్షయ వ్యాధి పట్ల సమాజాన్ని పూర్తిస్థాయిలో మరింత చైతన్యవంతం చేయుటకు ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించినట్లు వివరించారు.ఆసుపత్రిలో గుర్తించిన క్షయవ్యాధిగ్రస్తులను కూడా జిల్లా క్షయ నివారణ కార్యాలయం సిబ్బంది వెళ్ళి వారి యొక్క వివరములు తెలుసుకొని కేసుని నమోదు చేయటం జరుగుతున్నదని, గుర్తించిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుoదన్నారు, జిల్లా మొత్తం 9 టిబి యూనిట్లుగా ఏర్పాటు చేయబడిందని ఈ యూనిట్లలో MOTCలు, ఒక సీనియర్ TB సూపర్వైజర్ మరియు ఒక సీనియర్ TB ల్యాబ్ సూపర్వైజర్ RNTCPని పర్యవేక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.అనంతరం మెడికల్ కళాశాలలో జరిగిన జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో DM&HO డాక్టర్. రామ గిడ్డయ్య, జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్. నరేంద్ర నాథరెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.DM&HO డాక్టర్. రామగిడ్డయ్య మాట్లాడుతూ 2022 సంవత్సరంలో 42297 మంది రోగులకు మరియు 5162 TB రోగులకు గళ్ళ పరీక్షలు నిర్వహించబడ్డాయి మరియు రోగనిర్ధారణ చేయబడిన 5162 TB రోగులకు DOTS చికిత్స ప్రారంభించబడింది మరియు విజయవంతమైన రేటు 91% మరియు 156 TB HIV కో సోకిన కేసులు ART మరియు CPT చికిత్సలో చేయడం ప్రారంభించామన్నారు.క్షయ వ్యాధి అంటువ్యాధి అని మైక్రో బాక్టీరియ ట్యూబర్ క్లోసిస్ అనే సూక్ష్మజీవి ద్వారా ఇది సంక్రమిస్తుందని చెప్పారు. రెండు వారాలకు మించి దగ్గు, ఇతర లక్షణములు, ఆయాసం, బరువు తగ్గుట, కఫంలో రక్తం పడుట, ఛాతి నొప్పి, సాయంకాలం జ్వరం, రాత్రి నిద్రలో చెమట పట్టుట మొదలైనవి క్షయ రోగి లక్షణములు అని తెలిపారు. జిల్లాలో క్షయ వ్యాధి పీడుతుల కోసం సమర్ధవంతమైన చికిత్స అందించుటకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 2.5 లక్షలు జనాభాకు 1 టి.బి. యూనిట్ జిల్లాలో మొత్తం 9 టీబి యూనిట్లుగాను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.జిల్లా టీబి ఆఫీసర్ డాక్టర్ .భాస్కర్, వివిధ రకాల డిపార్ట్మెంటల్ డాక్టర్లు మాట్లాడుతూ టి.బి. & హెచ్.ఐ.వి ప్రతి ఒక్క అనుమానిత క్షయ తప్పనిసరిగా హెచ్.ఐ.వి. పరీక్ష చేయించుకోవాలని, అదే విధముగా హెచ్.ఐ.వి. కఫం పరీక్ష చేయించుకోవాలన్నారు. యస్.టి.ఇ.పి., ఎ.పి. శాక్స్ సమన్వయంతో పరీక్షలు నిర్వహించుట జరుగుచున్నదని చెప్పారు. హెచ్.ఐ.వి. ఎయిడ్స్ సోకిన రోగికి టి.వి. వ్యాధి సోకడానికి అధికమైన అవకాశాలు ఉండడమే గాక హెచ్.ఐ.వి. ఎయిడ్స్ రోగులు ఎక్కువగా క్షయ వ్యాధితో మరణిస్తున్నారని, కావున హెచ్.ఐ.వి. పరీక్షలు ప్రతి ఐ.సి.టి.సి. నందు ఉచితముగా చేసుకోవాలని అన్నారు క్షయ వ్యాధి గుర్తించిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగు తుందని అన్నారు. ప్రతి పేషెంటుకు నెలకు రూ.500/-లు చొప్పున ఆర్ధిక సహాయంతో పాటు, నిక్షయ మిత్ర వారి సహకారంతో నెలకు రూ.500/-లు ఖరీదు గల రేషన్ సరుకులను ఆరు మాసాల పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు 13 మంది పేషెంట్లకు కిట్లను పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు ట్రీట్మెంటు అయిన తరువాత రూ.1000/-లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు హాజరైన అధికారులు జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందజేశారు.అనంతరం హాజరైన వివిధ కళాశాలల విద్యార్థుల చేత క్షయవ్యాధి నిర్మూలనకు సంబంధించి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరిండెంట్ నరేంద్రనాథరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడి లు, వివిధ కళాశాలల విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.

About Author