గర్భిణీ స్త్రీలను ప్రసవానికి ముందే ఆసుపత్రిలో చేర్పించండి
1 min read– జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : గర్భిణీ స్త్రీలను ప్రసవానికి ముందే ఆసుపత్రిలో చేర్పించేలా చర్యలు గైకొనాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు శిక్షణా తరగతులకు హాజరైన ఏఎన్ఎం లకు, హెల్త్ సూపర్వైజర్లకు ఆదేశించారు.శుక్రవారం నగరంలోని మెడికల్ కళాశాల ఆవరణంలో కర్నూలు డివిజన్ లోని ఏఎన్ఎం లు, హెల్త్ సూపర్వైజర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పి కోటేశ్వరరావు గారు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూగర్భిణీ స్త్రీలను ప్రసవానికి ముందే ఆసుపత్రిలో చేర్పించాలని గర్భిణీ స్త్రీల వివరాలను మరియు వారికి అందిస్తున్న సేవలను ఆర్సిహెచ్ ఫార్మేట్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అనీమియా మానిటరింగ్ టూల్స్ యాప్ నందు గర్భవతులు మరియు కిషోర బాలికలు వారికి నిర్వహించిన రక్త పరీక్షల వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్న వారిని ఫాలో అప్ చేస్తూ వారికి మెడిసిన్ అందేలా చర్యలు గైకొనాలన్నారు. సిడి మరియు ఎన్సిడి సర్వేను 100% పూర్తి చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలకు 16 సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలందరికీ 100% టీకాలు వేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఎస్డిజి గోల్ సాధనకు గాను ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలన్నారు. స్త్రీలు చిన్న వయసులోనే గర్భం దాల్చకుండా ఉండుట కొరకు బాల్యవివాహాలను అరికట్టే విధంగా సచివాలయాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాలలోని హెల్త్ వర్కర్లు, సచివాలయ పరిధిలో నూతన దంపతులను కలిసి వారి ఆరోగ్య విషయంపై ఆరా తీయాలని స్త్రీలు గర్భం దాల్చినట్లయితే వారి వివరాలను అప్లోడ్ చేసి ప్రతి నెల వారి దగ్గరకు వెళ్లి రక్త పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి ఐరన్ మాత్రలు ఇస్తూ గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చేలా చూడాలని ప్రసవం అనంతరం 42 రోజులు ఆరోగ్యం పై దృష్టి ఉంచాలని శిశువులకు ఇమినైజేషన్ టీకాలు కూడా ఇవ్వాలన్నారు.0-5 సంవత్సరాల పిల్లలు అంగన్వాడి సెంటర్ లో ఉండేలా చూడాలని, బరువు తక్కువ పిల్లలకు పోషకాహార పదార్థాలు అందేలా చూడాలని సదస్సుకు హాజరైన సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్.రామగిడ్డయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్.ప్రవీణ్,DPMO డాక్టర్ ఉమా,RBSK డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ హేమలత, ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్.బాల మురళి,DPO విజయరాజు,SO హేమ సుందరం, డెమో శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.