పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందా.. ఈసారి కాటసాని కి కలిసొస్తుందా..
1 min read– రుటూ మార్చిన ఎమ్మెల్యే..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎంతటి వారికైనా ఎప్పుడో ఒకప్పుడు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది పవర్ ఒక్కరి దగ్గర ఉండడం అసాధ్యం లక్కు లక్ష్మి ఒక్కరి దగ్గర ఉండాలంటే మహాజతకులే ఆ కోవలోకి కాటసాని రాంభూపాల్ రెడ్డిని మాత్రం మరచిపోకూడదు అలాగే లక్కు. మంత్రి అనే పదవి మాత్రం సీనియర్ ఎమ్మెల్యేగా ఇప్పటికీ అందని ద్రాక్షే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నియోజకవర్గంలో తనదైన శైలిలో పట్టు నిలుపుకోవడానికి ప్రజాక్షేత్రంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు కల్లూరులో 1,91 పైచిలుకు ఓటర్లు ఉన్న మూడు మండలాలను కలిపి గడివేముల .పాణ్యం. ఓర్వకల్. లక్ష పైచిలుకు ఓట్లతో పాణ్యం నియోజవర్గంలో రాజకీయం అటే కత్తి మీద సామే మరి ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గ ఓటర్లు కరుణిస్తారా లేదా అనేది చూడాలి మొత్తానికి ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తారని పేరు ఉన్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ఎక్కడ వ్యతిరేకత లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కాటసానికే చెల్లింది కాటసాని క్యాడర్ అంటే ఇండిపెండెంట్ అయినా పార్టీ అయిన కాటసాని రికార్డు సమస్య చిన్నదైనా పెద్దదైన అసెంబ్లీ సమావేశాల నుంచి మొన్న నేరుగా వచ్చి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు అసెంబ్లీలో రైతులకు వైయస్సార్ పంట భీమ కింద నష్టపరహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని బాణీ వినిపించారు. రైతు సమస్యలపై మాత్రం తక్షణమే స్పందిస్తారని కేసి నుంచి నీటి విడుదల మద్దిలేరు వాగుకు ఎస్సాఅర్ బీ సీ నుంచి నీటి విడుదల వివిధ సమస్యలపై బాగానే స్పందిస్తారని పేరు ఈమధ్య రూటు మార్చి నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటున్న కాటసాని వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు అయితే కొన్ని వివాదాల్లో ఎమ్మెల్యే అనుచరుల పేర్లు కబ్జాలలో ముఖ్యంగా మట్టి మాఫియా ప్రతిదాంట్లో వినపడుతూ ఉండడంతో ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యే పై పలు ఆరోపణలు చేయడం అవన్నీ పుకార్లంటూ ఎమ్మెల్యే కొట్టి వేయడం నియోజవర్గం ప్రజలలో ఏ మేర ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాలి. నియోజకవర్గంలో ఎక్కడ పర్యటనకు వెళ్లిన సామాన్య ప్రజలకు సమస్యలు చెప్పుకునే అవకాశం దొరకదని చుట్టూ నాయకుల సమస్యలే ఎక్కువగా వస్తాయని నాయకుల సమస్యల పరిష్కారానికి సమయం సరిపోతుందని సామాన్య ప్రజల ఆవేదన మరి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పంథా మార్చుకొని గెలుపు గుర్రం ఎక్కి తన చిరకాల వాంఛ మంత్రి పదవి సాధిస్తారా అనేది వేచి చూడాలి మరి.