పంట నష్ట పరిహారం ఎకరాకు లక్ష 50 వేల రూ. ఇవ్వాలి
1 min read– ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: అకాల వర్షంతో వడగండ్ల వానతో నష్టపోయిన ఉద్యాన పంటల రైతాంగానికి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలని మొక్కజొన్న. ఇతర పంటలకు ఎకరాకు 40000 వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని గని. మంచాలకట్ట. జలకనూరు గ్రామంలోనీ వడగండ్ల వానతోదెబ్బతిన్న పొలాలను శుక్రవారం నాడు ఏపీ రైతు సంఘం బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారని వారికి రైతు యాజమాలతో సంబంధం లేకుండా కౌలుకు తీసుకున్న కౌలు రైతుకే కార్డు ఇచ్చి నేరుగా కౌలు రైతుకే బ్యాంకుల్లో డబ్బులు జమ అయ్యేటట్లు ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటివరకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా తాసిల్దార్. కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం ప్రతి సంవత్సరం రైతులు అధిక వర్షాలతో నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం కురవడంతో రైతాంగం అప్పులల్లో కురుకో పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాలజిల్లా రైతు సంఘం కార్యదర్శి రాజశేఖర్. ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు. రైతు సంఘం నాయకులు మద్దిలేటి. రామకృష్ణ. రైతులు వెంకట్ రాముడు. రాముడు. నాగన్న. తదితర రైతులు పాల్గొన్నారు.