సంక్షేమ పథకాలుతోనే పేదల అభ్యున్నతి
1 min read– హామీలును నెరవేర్చడంలో దేశానికే ఆదర్శం సీఎం జగన్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సంక్షేమ పథకాలుతోనే పేదల అభివృద్ధి జరుగుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు. నందికొట్కూరు పట్టణంలోని సచివాలయ 4 పరిధిలో శనివారం ఆత్మకూరు రోడ్డు,షాది ఖాన కాలనీలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పాల్గొన్నారు . ప్రతి ఇంటి గడపకు ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలుపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని దృష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు.వీధులలో నెలకొన్న సనస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందన్నారు.సమస్యల పరిష్కారానికే గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందన్నారు.ఎన్నికలలోనూ, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశంలోనే ఆదర్శంగా సీఎం జగన్ నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బానీ , కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ , నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల. ఉసేనయ్య , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు సంటిగారి దిలీప్ రాజ్ , బ్రాహ్మణకొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ , మండల తహసిల్దార్ రాజశేఖర్ బాబు , వైసిపి నాయకులు నాయకులు కార్యకర్తలు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.