నూకాలమ్మ నిండు నూరేళ్లు కాపాడమ్మా..
1 min read– కనివిని ఎరుగని రీతిలో ఉత్సవ కమిటీ కార్యక్రమాలు..
– కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక 43 వ డివిజన్ లో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి ఉత్సవాలు అనంతరం ఆదివారం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అధినేత మరియు ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు.ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి నూకాలమ్మ నిన్ను కొలిచే భక్తులను నిండు నూరేళ్లు కాపాడమ్మా అంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 43 డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి కనక రాజేశ్వరి కృష్ణ , వారికి ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ చైర్మన్ నక్క నాగేశ్వరరావు , వైఎస్ఆర్సిపి డివిజన్ ప్రెసిడెంట్ వెల్లంకి రాజు, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ఆలయ కమిటీ పెద్దలు తదితరులు ఎస్ ఎం ఆర్ పెదబాబు కి స్వాగతం పలికి ఘన స్వాగతంతో పాటు సన్మానం నిర్వహించారు వారి అభిమానం చిరస్మరణీయమని కొనియాడారు.