PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యమ నాయకుడు గుంటూరు బాపనయ్య సేవలు చిరస్మరణీయం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  భూమి కోసం వెట్టిచాకిరి  విముక్తి కోసం  జమీందారీ వ్యవస్థ పై వీరోచిత పోరాటాల నిర్వహించిన గుంటూరు బాపనయ్య జీవితం, పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నాయకుడు, మాజీ శాసనసభ్యులు గుంటూరు బాపనయ్య 45 వర్ధంతి సందర్భంగా ఆదివారం దేవనకొండ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.శనివారం నాడు సిఐటియు కార్యాలయంలో యువజన సంఘం నాయకుడు మహేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ భాష గుంటూరు బాపునయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వీరశేఖర యూసుఫ్ భాష లు మాట్లాడుతూ అట్టడుగు కులాల్లో పుట్టి కమ్యూనిస్టు పార్టీ ద్వారా చైతన్యం అయి పేదలు బడుగు బలహీన వర్గాలకు కోసం ఉద్యమాలు నిర్మించి ఆనాటి చల్లపల్లి జమీందారు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు నిర్వహించి దళితులకు, బడుగులకు భూమి పంచిన చరిత్ర గుంటూరు బాపనయ్య  గారిది అని,తన జీవిత చరమాంకం వరకు పేద ప్రజల శ్రేయస్సు కోసం పరితపించి ఉద్యమంలోనే అసువులు బాసిన గుంటూరు బాపనయ్య గారి జీవితం అందరికీ ఆదర్శం ప్రాయమని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలకు ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో భూమి ,ఇల్లు, ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాగేష్, రంగన్న, నరసయ్య ,ముని ,బండ్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author